Home » బిగ్ క్వశ్చన్: ‘ది ప్యారడైజ్’ హీరోయిన్ ఎక్కడ.?

బిగ్ క్వశ్చన్: ‘ది ప్యారడైజ్’ హీరోయిన్ ఎక్కడ.?

by Mudra369 Editorial Desk
0 comments
Kayadu Lohar The Paradise

Kayadu Lohar The Paradise.. తెలుగు మీడియా కాదు, తమిళ మీడియా ప్రశ్నించింది ‘ది ప్యారడైజ్’ హీరోయిన్ ఎక్కడని.!

ఒకింత ఎంబరాసింగ్ క్వశ్చన్ ఇది హీరో నానికి.! అలానే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి కూడా.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు ‘ది ప్యారడైజ్’ సినిమాని. ట్రైలర్ విడుదల చేయడానికి కూడా సమయం దొరకలేదు.. దాంతో, ట్రైలర్ లేకుండానే సినిమాని రిలీజ్ చేసేస్తున్నారు.

ప్రమోషనల్ ఈవెంట్స్ వరుసగా జరుగుతున్నాయి. ‘ది ప్యారడైజ్’ టీమ్ చెన్నయ్‌లో తమిళ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది.

తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్ కయాదు లోహార్ ఇప్పుడు బీభత్సమైన స్టార్‌డమ్ సంపాదించుకుని వుంది. అందుకేనేమో, ‘హీరోయిన్ ఎక్కడ..’ అని తమిళ మీడియా ప్రశ్నించింది.

‘మీ తమిళ సినిమాల వల్లనే ఆమె నా తెలుగు సినిమా ప్రమోషన్‌కి రాలేకపోతోంది’ అని నాని ‘కవర్ డ్రైవ్ చేశాడు. దర్శకుడు మారి సెల్వరాజ్, ఆమెకు సమయం ఇవ్వడంలేదని నాని చెప్పుకొచ్చాడు సరదాగా.

Kayadu Lohar The Paradise.. కవర్ డ్రైవ్ కుదరదు కయాదూ.!

కొద్ది రోజుల క్రితం, సినిమా ప్రమోషన్స్ విషయమై కయాదు లోహార్ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. వరుసగా సినిమాలు చేస్తుండడం వల్ల, సినిమా ప్రమోషన్స్‌కి హాజరు కాలేకపోతున్నానని చెప్పిందామె.

తమిళనాట కూడా కయాదు లోహార్‌కి సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ విషయమై ఇబ్బందులున్నాయ్. అయితే, పెద్ద సినిమా – చిన్న సినిమా.. ఈ లెక్కలేసుకుని కయాదు, ‘బంక్’ కొడుతోందన్న విమర్శలూ లేకపోలేదు.

‘ది ప్యారడైజ్’ చాలా పెద్ద సినిమా. ఇప్పటిదాకా కయాదు ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా ‘ది ప్యారడైజ్’ గురించి ప్రమోట్ చేయడంలేదు.

ఎందుకిలా.? ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఆమె కోరుకున్న రీతిలో ఆమె పాత్ర డిజైన్ అవలేదా.? లేదంటే, ముందు అనుకున్నట్లుగా కాకుండా ఆమె పాత్ర నిడివి తగ్గిపోయిందా.?

బోల్డన్ని అనుమానాలు ఇలానే తెరపైకొస్తాయ్. కానీ, నాని మాత్రం ‘వస్తుంది.. ఖచ్చితంగా వస్తుంది.. త్వరలో ఆమెను చూస్తారు.. మా ప్రమోషన్స్‌లో..’ అని చెబుతున్నాడు.

ఓ సినిమా చేయడం.. ఆ సినిమాని ప్రమోట్ చేయడం.. రెండూ ముఖ్యమే. చేస్తున్న సినిమాని ప్రమోట్ చేసుకోలేకపోతే, సినిమాలు చేయడమే దండగ.. అనే వాదన లేకపోలేదు.

నాని, శ్రీకాంత్ ఓదెల.. ఈ ఇద్దరే ‘ది ప్యారడైజ్’ సినిమాని భుజానికెత్తుకుని ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు.

చెన్నై ప్రెస్ మీట్‌కి కీర్తి సురేష్‌ని అయినా ‘ది ప్యారడైజ్’ టీమ్ తీసుకెళ్ళి వుండాల్సింది. ఆమె ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం విదితమే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group