సూపర్ స్టార్ మహేష్‌బాబు (Happy Birthday Mahesh) పుట్టినరోజు.. అంటే, ఆ కిక్ ఎలా వుంటుందో తెలుసా.? ట్వీట్లు పోటెత్తుతాయ్.. వ్యూస్ అదిరిపోతాయ్.. అవును, నిజంగానే ట్విట్టర్ పోటెత్తింది.. ఫేస్‌బుక్ అదిరిపోయింది.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్.. వాట్ నాట్.. ఎటు చూసినా మహేష్ మేనియానే.
తమ అభిమాన హీరో పుట్టినరోజు నేపథ్యంలో ముందస్తుగానే సంబరాలు మొదలు పెట్టిన మహేష్‌బాబు (Happy Birthday Super Star Mahesh Babu) అభిమానులు, తమ అభిమానానికి ఆకాశమే హద్దు.. అని మరోమారు నిరూపించారు. ఆ అభిమానుల సంబరాల్ని మరింత ఉత్సాహంగా మార్చేందుకోసం ‘సరిలేరు నీకెవ్వరూ’ టీమ్, సర్‌ప్రైజ్‌ని విడుదల చేసింది.
ఫస్ట్ లుక్ లాంటిదేదో వస్తుందని అనుకుంటే.. అంతకు మించిన సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. మేజర్ అజయ్ కృష్ణని (Happy Birthday SSMB) ఇంట్రడ్యూస్ చేస్తూ, వీడియో ప్రోమోని ‘సరిలేరు నీకెవ్వరూ’ టీమ్ వదిలేసరికి, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మహేష్‌బాబు స్టైలిష్ లుక్, ఈ టీజర్‌కి (సర్‌ప్రైజ్ ప్రోమో) హైలైట్‌గా చెప్పుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈ ప్రోమోని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళితే.. దానికి అదనపు హంగులద్దిన ఘనత ముమ్మాటికీ సినిమాటోగ్రఫీదే. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ పక్కన పెడితే, మహేష్‌ని (Sarileru Neekevvaru) అలా సైన్యం దుస్తుల్లో చూడం అభిమానులకి కనువిందు చేసింది.
ఓవరాల్‌గా మహేష్‌ని మేజర్ అజయ్ కృష్ణగా చూశాక అభిమానులే కాదు, అందరూ ‘హీ ఈజ్ ది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్..’ అనకుండా వుండలేరు. అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చాలా స్కోప్ వుంటుంది. అదే సమయంలో, యాక్షన్ ఎపిసోడ్స్‌ని తనదైన స్టయిల్లో తెరకెక్కిస్తుంటాడు.
సో, ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి ఓ రేంజ్‌లో యాక్షన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట. ప్రస్తుతానికి జస్ట్ హీరో ఇంట్రడక్షన్ మాత్రమే ప్రోమోగా విడుదల చేసినా, స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనిల్ రావిపూడి నుంచి రానుందంటూ అభిమానులు ఫిక్సయిపోయారు.
కన్నడ బ్యూటీ రష్మిక మండన్న (Rashmika Mandanna) తొలిసారిగా మహేష్‌తో జతకడ్తోంది ఈ సినిమాతో. చాలాకాలం తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తుండడం గమనార్హం. భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణంలోనూ మహేష్ భాగం పంచుకుంటున్న విషయం విదితమే.
2019 సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్‌ని ‘ఎఫ్2’తో కొట్టిన అనిల్ రావిపూడి (Anil Ravipudi), ‘సరిలేరు నీకెవ్వరూ’తో మరో హిట్ కొట్టడానికి మళ్ళీ సంక్రాంతినే టార్గెట్‌గా చేసుకున్నాడు.
లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ సూపర్ స్టార్ మహేష్‌బాబు స్టైలిష్ వెంచర్ ‘సరిలేరు నీకెవ్వరూ’. వన్స్ ఎగైన్, హ్యాపీ బర్త్ డే టూ యూ సూపర్ స్టార్ మహేష్‌బాబు. Happy Birthday Super Star Mahesh Babu