Mega Star Chiranjeevi Politics మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంకా రాజకీయాల్లోనే వున్నారా.? ఈ డౌటానుమానం ఇప్పుడెందుకొచ్చింది చెప్మా.?
కాంగ్రెస్ పార్టీని చిరంజీవి వదిలేశారు. కానీ, చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ పార్టీ వదిలేసుకోలేదు. వదిలేది లే.. అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
మొన్నామధ్యన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి ఓ డైలాగ్ చెప్పారు. ‘రాజకీయాన్ని నేను వదులుకున్నా.. రాజకీయం నన్ను వదలనంటోంది..’ అనే సారాంశం ఆ డైలాగ్లో వుంది.
Mega Star Chiranjeevi Politics ఏపీ కాంగ్రెస్ చీఫ్ మాటల వెనుక.!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఒకాయన చిరంజీవి, ఇంకా తమ పార్టీలోనే వున్నారని చెబుతున్నారు. మొన్నీమధ్యన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగితే, ఓటేయాల్సిందిగా చిరంజీవికీ ఆహ్వానం పంపారు.

కానీ, చిరంజీవి వెళ్ళలేదు. రాజకీయాల్లో తాను లేననీ, రాజకీయాలకు దూరంగా వున్నాననీ, మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళబోననీ చిరంజీవి పదే పదే చెబుతున్నారు.
చిరంజీవి అయితే, రాజకీయాల్లో లేరు. ఆ విషయం ఆయన అన్నిసార్లు కుండబద్దలుగొట్టాల్సిన పనే లేదు.
తమ్ముడు పార్టీకీ సైతం ‘నో’.!
తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పట్ల కూడా చిరంజీవి ఆసక్తితో లేరు. ‘తమ్ముడు రాజకీయంగా ఎదగాలనుకుంటాను.. వాడికి నా సపోర్ట్ ఎప్పుడూ వుంటుంది..’ అని మాత్రమే చిరంజీవి చెబుతున్నారు.
Also Read: బ్రోకర్లూ.? జోకర్లూ.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలెటువైపు.?
అయినాగానీ, రాజకీయం చిరంజీవిని వదలట్లేదు. చిరంజీవి మీద అభిమానం వుందంటూనే, నిస్సిగ్గుగా ఆయన మీద కొందరు ఇంకా రాజకీయ విమర్శలు చేస్తూనే వున్నారు.