ఊరికే మెగాస్టార్ (Mega Star Chiranjeevi) అయిపోలేదు. 150 సినిమాలకు పైగా కష్టం ఆయన సొంతం. మెగాస్టార్ చిరంజీవి.. అది జస్ట్ ఓ పేరు కాదు. అదొక బ్రాండ్. సినీ పరిశ్రమ పట్ల చిరంజీవి అంకిత భావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, వయసు మీద పడుతున్న కొద్దీ మెగాస్టార్ చిరంజీవిలో గ్లామర్ ఇంకా ఇంకా పెరిగిపోతూనే వుంది. ఇటీవల ‘గుండు’తో ఓ ఫొటోకి పోజిచ్చిన చిరంజీవి, అందరూ అవాక్కయ్యేలా చేసిన విషయం విదితమే.
అయితే, అది ‘రియల్ గుండు’ కాదు, మేకప్ టెక్నిక్ మాయ అని ఆ తర్వాత తేలింది. దానికి సంబంధించి ఓ వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేశారు. ఈ క్రమంలో ఆయన సినిమా పరిశ్రమ గొప్పతనం గురించి తనదైన స్టయిల్లో చెప్పారు.
సినీ పరిశ్రమకీ, మేకప్ టెక్నీషియన్లకీ థ్యాంక్స్ చెప్పారు. ‘అర్బన్ మంక్’ అంటూ ఈ వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేయగా, లక్షలాది వ్యూస్ వచ్చి పడ్డాయి అతి తక్కువ సమయంలోనే. సినిమాకి సంబంధించి ప్రతి విషయమ్మీదా చిరంజీవికి అవగాహన వుంది.
కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటుంటారు. అలా ఈ మేకప్ టెక్నిక్‌ని ఆయన లేటెస్ట్‌గా ప్రయత్నించారన్నమాట. అఫ్‌కోర్స్, కెరీర్‌లో ఇలాంటివి ఈ స్థాయి సాంకేతితతో కాకపోయినా, చిరంజీవి చాలానే చూసేసి, చేసేసి వుంటారు.
అయినాసరే, కొత్త విషయాల్ని చాలా ఆసక్తిగా తెలుసుకునే చిరంజీవి, వాటిని ప్రమోట్ చేయడంలోనూ తనదైన ముద్ర వేస్తుంటారు. ఇదిలా వుంటే, చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా పనుల్లో బిజీగా వున్నారు. కరోనా హోరు తగ్గితే తప్ప, ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం.
కాజల్ అగర్వాల్‌ని (Kajal Agarwal) ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సరసన హీరోయిన్‌గా ఖరారు చేసిన విషయం విదితమే.