Megastar Chiranjeevi వున్నపళంగా మెగాస్టార్ చిరంజీవి తన సినిమా ‘విజేత’ చూసుకోవాలట.! అలాగని ఓ పాత్రికేయ పండితుడు మెగాస్టార్ చిరంజీవికి ఓ ఉచిత సలహా పారేశాడు.!
నూట యాభైకి పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తాను నటించిన ‘విజేత’ సినిమా చూసుకుని, ఆత్మవిమర్శ చేసుకోవాలట.!
ఇప్పటికిప్పుడు దేవుడు దిగొచ్చి.. పూజల పేరుతో పాలను, పళ్ళనూ వృధా చేయొద్దు.. అంటే, ఎవరైనా వింటారా.? ‘నువ్వెవడ్రా చెప్పడానికి.?’ అని ఆ దేవుడ్నే తిట్టిపోస్తారు.!
Megastar Chiranjeevi.. ట్రెండ్ మారింది గురూ.!
‘వాల్తేరు వీరయ్య’ సినిమా సక్సెస్ చాలామందికి మింగుడు పడ్డంలేదు. అందుకే, ఈ వెకలి రాతలు. ‘విజేత’ సినిమా మళ్ళీ చూసి, చిరంజీవి కొత్తగా నేర్చుకోవాల్సిందేముంది.?

ఏం, ‘విజేత’ సినిమానే ఎందుకు.? ఓ ‘రుద్రవీణ’, ఓ ‘స్వయంకృషి’ చూడకూడదా.? చూడొచ్చు.. ఎందుకు చూడకూడదు.?
నిజానికి, ఆ సినిమాల్ని చూసి చిరంజీవి కొత్తగా నేర్చుకోవడానికేమీ వుండదు. అవన్నీ తన నుంచి వచ్చిన గొప్ప గొప్ప సినిమాలే. వాటితోనే కదా, చిరంజీవి ఈ స్థాయికి ఎదిగింది.
సినిమా.. ఇదొక వ్యాపారం.!
నిర్మాతకి డబ్బులెలా వస్తాయ్.? అన్న కోణంలో సినిమా చుట్టూ రకరకాల ‘కమర్షియల్ హంగులు’ అద్దుకుంటాయ్. ఆ విషయాన్ని ప్రత్యేకంగా ఎవరికీ గుర్తు చేయాల్సిన పనిలేదు.
Also Read: చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ.! సంక్రాంతి ‘వీరు’డెవ్వరు.?
కాంబినేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇవన్నీ కలగలిసి, ఓ కమర్షియల్ ప్రోడక్ట్‌ని తయారు చేస్తుంటారు. అలాంటిదే, ‘వాల్తేరు వీరయ్య’.!
ఏమో, చిరంజీవి నుంచి మళ్ళీ ఓ మాంఛి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చూస్తామేమో.! అది ఆయన స్వతహాగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఎవరైనా చిరంజీవిని శాసించాలనుకుంటే.. అదెలా కుదురుతుంది.?
పద్ధతిగా సినిమాలు చేస్తే, పచ్చి పచ్చిగా ట్రోలింగ్ జరుగుతోన్న రోజులివి.! చెత్త సినిమాల్ని చూసి ప్రేక్షకులు ఎగబడుతున్న కాలమిది.!
కొత్తగా ఇప్పుడేదో ట్రెండ్ సృష్టించెయ్యాలని చిరంజీవి ఆరాటపడితే, నష్టపోయేది నిర్మాతలే.! ఆ విషయం చిరంజీవికి బాగా తెలుసు.
దర్శకులు కొత్త ఆలోచనలు మానేసినప్పుడు.. నిర్మాతలు కాంబినేషన్ క్రేజ్‌ని నమ్ముకుంటున్నప్పుడు.. చిరంజీవి మాత్రం ఏం చేయగలరు.?