Ys Jagan Europe Tour.. న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు, న్యాయస్థానం నిర్దేశించిన నిబంధనల్ని పాటిస్తామని ఒప్పుకున్నారు.. వైఎస్ జగన్, విదేశాలకు వెళ్ళారు.!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చాలా ఏళ్ళ క్రితం అక్రమాస్తుల కేసు నమోదయ్యింది.
ఆ కేసు కారణంగానే, వైఎస్ జగన్ దాదాపు 16 నెలల పాటు జైల్లో వున్నారు. జైల్ నుంచి బెయిల్ మీద విడుదలయ్యే సమయంలో, న్యాయస్థానం పలు షరతులు విధించింది.
షరతులకు వైఎస్ జగన్ ఒప్పుకున్నాకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ దొరికింది. ఇన్నేళ్ళుగా కొన్ని షరతులు అలానే వున్నాయ్. వాటికి లోబడే వైఎస్ జగన్, బెయిల్ మీదున్నారు.
ఆ షరతుల్లో ఒకటి, విదేశాలకు వెళితే, అనుమతి తప్పనిసరి అని. న్యాయస్థానాన్ని వైఎస్ జగన్ ఆశ్రయించడం, న్యాయస్థానం.. సీబీఐ నుంచి క్లియరెన్స్ తీసుకోవడం.. ఇవన్నీ పరమ రొటీన్ వ్యవహారాలు.
Ys Jagan Europe Tour.. వైఎస్ జగన్ యూరోప్ పర్యటన..
ఇవన్నీ ఇప్పుడెందుకంటే, వైఎస్ జగన్ తాజాగా యూరోప్ పర్యటనకు వెళ్ళారు. రెండు వారాల పాటు వైఎస్ జగన్, యూరోప్ పర్యటనలో వుంటారు.
ఎప్పుడు వైఎస్ జగన్, విదేశాలకు వెళ్ళినా ఒకటే పంచాయితీ.. రాజకీయ ప్రత్యర్థులు ఆయన మీద సెటైర్లు వేస్తుంటారు.. దుమ్మెత్తి పోస్తుంటారు కూడా.!
ఈసారి కూడా అదే జరుగుతోంది. అసలెందుకీ పంచాయితీ.?
ఎందుకంటే, వైఎస్ జగన్ సహా వైసీపీకి చెందిన నేతలు, వైసీపీ కార్యకర్తలు.. తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ‘వీకెండ్ పొలిటీషియన్’ అంటూ విమర్శలు చేస్తుంటారు గనుక.
Also Read: యుద్ధోన్మాదం.! ‘అమెరికా దెబ్బ’కి విలవిల్లాడుతున్న ప్రపంచం.!
తప్పదు.. వైఎస్ జగన్, ఈ విమర్శల్ని ఎదుక్కోవాల్సిందే.. అదీ, షరతుల సడలింపు వచ్చేదాకా.! అయితే, వైఎస్ జగన్, విదేశాలకు వెళ్ళడం నేరమేమీ కాదు. అంతలా ఆయన్ని ట్రోల్ చేయాల్సిన అవసరమూ లేదు.
తన కుమార్తెలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న దరిమిలా, ఓ తండ్రిగా తన కుమార్తెల్ని కలిసేందుకు వైఎస్ జగన్ విదేశాలకు వెళుతుంటారు.
