Minister Roja Chappals Employee ఎంతైనా మంత్రిగారు కదా.! ఆ మాత్రం దర్పం ప్రదర్శించకపోతే ఎలా.? పైగా, రాజకీయాల్లో పైర్ బ్రాండ్.!
ఆమె మాటకి రాజకీయ ప్రత్యర్థులు భయపడతారా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, పక్కనున్న ఉద్యోగులు మాత్రం భయపడాల్సిందేనేమో.!
ఎంతలా భయపడకపోతే, ఉద్యోగి ఒకరు ఆమె చెప్పులు మోస్తారు.? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది.!
వివరాల్లోకి వెళితే, సినీ నటి.. నగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా, బాపట్ల సూర్యలంక బీచ్‌ని సందర్శించారు.
ఈ సందర్భంగా బీచ్ అభివృద్ధి గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. బీచ్ పరిసరాల్లో ఆమె కలియతిరిగారు. ఆమె వెంట అధికారులూ వున్నారు.
Minister Roja Chappals Employee.. చెప్పులు మోయించడమేంటి చెప్పమ్మా.. రోజమ్మా.?
ఇసుకలో నడుస్తూ అప్పటిదాకా బాగానే వున్న రోజా, కాస్సేపటికి చెప్పులు తీసి నడిచారు. ఆ చెప్పుల్ని ఆమె వంట నడుస్తున్న ఓ ఉద్యోగి పట్టుకుని నడవడం మీడియా కెమెరాలకు చిక్కింది.
దాంతో, ఈ వ్యవమారం కాస్తా పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. మంత్రి అయినా.. ముఖ్యమంత్రి అయినా.. ప్రభుత్వ ఉద్యోగులెవరూ వాళ్ళ చెప్పులు మోయాలనే రూల్ లేదు.
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
సభ్య సమాజం హర్షించే విషయం కాదిది.! ఇది ప్రజాస్వామ్యం.! కానీ, వైసీపీ పాలనలో రాచరికమే కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.