Modicare Products.. ఖర్చు చేస్తే, ఆదాయం రావడమేంటి.? మామూలుగా అయితే, ఏదన్నా ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే, డిస్కౌంట్ లభిస్తుంది.
ఆ డిస్కౌంట్‌తోపాటుగా, మీకు ఎంతో కొంత ఆదాయం లభిస్తే, అదే మీ వ్యాపార మార్గంగా మారితే.. అదే, మోడీ కేర్.!
ఎవరో మోడీ కేర్ గురించి చెబితే, గతంలో ఆమ్వే, క్వాంటమ్ వంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యవహారాలు గుర్తుకొచ్చాయ్.
వాటికి ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. కానీ, మోడీ కేర్ అలా కాదు. మనకు అవసరమైన ప్రోడక్ట్స్ ఏమైనా వుంటే, కొనుక్కోవడమే వ్యాపారం.! అదే ఆదాయ మార్గం.!
Modicare Products.. మాయా మర్మం… ఏదీ లేదు..
ఇదెలా.? అన్న డౌట్ మీకు రావడంలో వింతేమీ లేదు. కానీ, ఇందులో మాయా మర్మం.. అనుకోవడానికీ ఏమీ లేదు. అంతా ఓపెన్.!
ఓ షాపూ ప్యాకెట్ కావొచ్చు, బట్టలు ఉతికేందుకు ఉపయోగించే వాషింగ్ మెసీన్ లిక్విడ్ కావొచ్చు.. టీ కోసం వినియోగించే, టీ పౌడర్ కావొచ్చు.. ఇలాంటివన్నీ, మోడీ కేర్ ప్రోడక్ట్స్ రూపంలో మీకు లభ్యమవుతాయి.
మోడీ కేర్ సభ్యత్వం తీసుకుంటే, మీరు ఇవన్నీ కొనుక్కోవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తంలో నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం వినియోగిస్తుంటాం కదా.? అలాగే ఇక్కడ కూడా.

ప్రతి నెలా కొంత మొత్తం ఖర్చు చేసి, సరుకులు కొనుక్కుంటే, ఆర్నెళ్ళ తర్వాత మీకు కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ లభిస్తాయ్. దాంతోపాటుగా, మీక్కొంత బోనస్ లభించొచ్చు.
మీలాగే ఇంకెవరైనా, ఈ ప్రోడక్ట్స్ పట్ల ఆసక్తి చూపిస్తే, వారినీ మీరు మెంబర్స్‌గా చేర్పించొచ్చు. మెంబర్‌షిప్ కోసం మీరుగానీ, ఇంకెవరుగానీ సొమ్ములేవీ చెల్లించాల్సిన పనిలేదు.
మీకు ఆదాయం ఇలా..
మీ బ్యాంక్ అకౌంట్, పాన్ నెంబర్.. వీటిని మీ మెంబర్‌షిప్‌కి జోడిస్తే, మీకు లభించే బోనస్‌ని ఆ బ్యాంక్ అకౌంట్‌కి జమ చేస్తుంది కంపెనీ.
మీ తర్వాత చేరే మెంబర్స్ పెరిగే కొద్దీ, మీ ర్యాంక్ పెరుగుతూ వస్తుంది. తద్వారీ మీకు కంపెనీ నుంచి ఆదాయం లభిస్తుంది. వందలు, వేలు, లక్షలు కూడా ఆదాయాన్ని ఆర్జించొచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న బిజినెస్ మోడల్ ఇది.
Also Read: బరువులెత్తడం బ్రహ్మవిద్యేం కాదు భామామణులకి.!
పది రూపాయలు కూడా ఖర్చు చేయకుండానే, మెంబర్‌షిప్ లభిస్తుంది గనుక, ఇష్టమైతేనే ప్రోడక్ట్స్ కొనుక్కునే వెసులుబాటు వుంది గనుక.. ఎవరైనా తేలిగ్గానే ఈ బిజినెస్ పట్ల ఆకర్షితులవ్వొచ్చు.
మోడీ కేర్ ప్రొడక్ట్స్ ఏవీ హానికారక కెమికల్స్‌తో తయారవలేదట.! ఈ ప్రోడక్ట్స్ వాడిన వారైతే, మార్కెట్‌లో దొరికే ఇతర ప్రోడక్ట్స్‌తో పోల్చితే, ఇవి అత్యంత నాణ్యమైనవని చెబుతున్నారు.