కారణమేదైతేనేం, మోనాల్ గజ్జర్ మళ్ళీ ఏడ్చేసింది. ఈసారి మోనాల్ గజ్జర్ ఏడవడానికి చాలా కారణాలే వున్నాయి. వంటలక్క లాస్య, మోనాల్ గజ్జర్ (Monal Abijeet Akhil Triangle Story)అడిగినా భోజనం పెట్టలేదట. ఇంకోపక్క, మోనాల్ పేరుని అమ్మ రాజశేఖర్ నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా అఖిల్‌ని నామినేట్ చేస్తూ ప్రస్తావించడం ‘నిప్పు’ని రాజేసింది.
అబిజీత్, మోనాల్‌ని నామినేట్ చేస్తూ.. అందుకు ‘తగిన’ కారణాన్నే చెప్పాడు. ఇలా, ఈ మూడు విషయాలపైనా మోనాల్ గజ్జర్ ఏడ్చేసింది. ఏడుపు, మోనాల్ ఎమోషన్. ‘నేను చాలా సెన్సిటివ్, నేను చాలా ఎమోషనల్..’ అంటూ మోనాల్ గజ్జర్ ఇంకోసారి ‘కుళాయి’ తిప్పేసింది.
చూస్తోంటే, ఇది కంటెస్టెంట్స్ మనసుల్లోంచి వచ్చింది కాదు, ఇదంతా ఓ పద్ధతి ప్రకారం.. ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందనే భావన చాలామందిలో కలుగుతోంది. అంతకు ముందే, అబిజీత్ – అఖిల్ ఫ్రెండ్స్ అయిపోయారు. మోనాల్, మోహబూబ్‌ని తన తమ్ముడిగా భావించింది. లాస్య – మోనాల్ మధ్య కూడా ఇష్యూస్ తగ్గిపోయాయి.
కానీ, నామినేషన్స్‌లో మళ్ళీ పాత వ్యవహారాలే తెరపైకొచ్చాయంటే ఏమనుకోవాలి.? తమ్ముడు ఎక్కడన్నా అక్కని నామినేట్ చేస్తాడా.? అర్థం పర్థం లేని నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. అందులో కంటెస్టెంట్స్ ఇంకా చెత్త రీజన్స్ చెబుతున్నారు. టీ గురించి అవినాష్, లాస్యను నామినేట్ చేయడమేంటో.!
‘మన మధ్య ఇష్యూస్ ఇక్కడితో తొలగిపోతాయ్..’ అంటూ మెహబూబ్, అరియానాని ఇంకోసారి హౌస్ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించాడు. మరోపక్క, అఖిల్ – మెహబూబ్ – సోహెల్.. ఓ పద్ధతి ప్రకారం గ్రూపు కట్టేసి, ప్రత్యర్థుల్ని నామినేట్ చేసి పడేస్తున్నారాయె.
అమ్మ రాజశేఖర్‌కి ఇటు తెలుగు సరిగ్గా రావడంలేదు.. అటు ఇంగ్లీషు కూడా అంతంతే. దాంతో, ఏదో చెప్పాలనుకుంటోంటే.. ఇంకోటేదో కన్వే అవుతోంది. అదేంటో, అరియానా అందరికీ సాఫ్ట్ టార్గెట్ అయిపోతోంది. అవినాష్, హారిక కూడా నామినేషన్స్ సందర్భంగా ఇచ్చిన రీజన్స్‌తో అభాసుపలయ్యారు.
ఓవరాల్‌గా చూస్తే, నామినేషన్స్ ప్రక్రియ అనేది ఓ చెత్త టాస్క్ అయిపోయింది. దాన్ని పట్టుకుని ఎవరు ఓట్లు వేస్తున్నారు.? అనే సంగతి పక్కన పెడితే, ఆయా కంటెస్టెంట్స్ ఫాలోవర్స్ మాత్రం.. అడ్డగోలుగా సోషల్ మీడియాలో చెత్త వాగుడు వాగేస్తూ, ఈ షోకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ అఖిల్ – మోనాల్ – అబిజీత్ మధ్య ఏముంది.? ఏమీ లేదు, జస్ట్ ఓ చెత్త సినిమా స్క్రిప్ట్ తప్ప.!