Monita Aka Shobha Shetty.. శోభా శెట్టి అంటే ఎవరు.? అలా కాదు.. ‘కార్తిక దీపం’ సీరియల్ అంటే తెలుస్తుంది. ఆ సీరియల్‌లో మోనిత అంటే అందరికీ ఠక్కున గుర్తొస్తుంది.
పరిచయం చేయక్కర్లేని పాత్ర ఆమెది. అంతలా మోనితగా బుల్లితెర ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేయించుకుంది. అదీ ఆమె రేంజ్ కానీ అది అప్పుడు.. ఇప్పుడామె రేంజ్ ‘బిగ్’ రేంజ్.!
అవునండీ.! బిగ్‌బాస్ (Bigg Boss Telugu Season 7) షోలో మోనిత అలియాస్ శోభా శెట్టి (Shobha Shetty) ఓ కంటెస్టెంట్.
సీరియల్‌లో తనదైన నెగిటివ్ పర్‌పామెన్స్‌తో ఆకట్టుకున్న మోనిత ఇప్పుడు బిగ్‌బాస్‌లో సరికొత్త పర్‌పామెన్స్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది.
Monita Aka Shobha Shetty.. బ్యూటీ ఆఫ్ ఆటిట్యూడ్..
మోనితగా నెగిటివ్ షేడ్స్‌లోనే ఇంతవరకూ తనను చూశారనీ, ఇప్పుడు అసలు సిసలు శోభా శెట్టిని చూస్తారనీ చెప్పుకొచ్చింది.
బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం అంటే, ఏమంత ఆషా మాసీ కాదండోయ్. ఏదో ఒక స్పెషల్ టాలెంట్ వుంటే కానీ ఈ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వీలు పడదు.

కేవలం సిరియల్ ఆర్టిస్ట్ అన్నదే మోనిత స్పెషల్ క్వాలిటీనా.? అంటే కాదట. ఆమెలో రకరకాల స్పెషల్ టాలెంట్స్ వున్నాయట.
అవేంటో.. బిగ్‌బాస్ షోలో ముందు ముందు బయటపెడుతుందట మోనిత. గ్లామర్‌లో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ.. యాక్టివ్‌గా అందరితోనూ కలిసిపోతోంది మోనిత.
Also Read: విజయ్ దేవరకొండ, సమంత.! ‘లిప్పు లాకు’ వెనుక.!
అవసరం వస్తే, తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏ స్థాయిలోనైనా డిఫెండ్ చేసుకోగల సత్తా తనలో వుందంటోంది. ఆల్రెడీ ఫస్ట్ నామినేషన్‌లో భాగంగా శోభా శెట్టి తన టాలెంట్ చూపించేసింది.
తోటి కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణతో చిన్న కిరికిరి.. తనదైన ఆటిట్యూడ్ చూపించి హౌస్ మేట్స్‌కి షాకిచ్చింది. ఇక ముందు ముందు అమ్మడి టాలెంట్ ఏ రేంజ్‌లో వుండబోతోందో ఏమో.!
బుల్లితెరపై విలనిజం శోభా శెట్టికి బోల్డంత పేరు తెచ్చిపెట్టింది.. బిగ్ బాస్‌లో విలనిజం అంటే, ఖచ్చితంగా తేడా కొట్టేస్తుంది సుమీ.!