Table of Contents
అక్కినేని బుల్లోడు, ‘సిసింద్రీ’ అఖిల్ తాజా సినిమా ‘మిస్టర్ మజ్ను’ టీజర్ (Mr Majnu Teaser Review) విడుదలయ్యింది. అఖిల్ (Akhil Akkineni) సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) (అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ (Savyasachi) ఫేం) హీరోయిన్‌గా నటించింది ఈ చిత్రంలో. వెంకీ అట్లూరి (మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘తొలి ప్రేమ’ ఫేం) ఈ చిత్రానికి దర్శకుడు.
డాన్సుల్లో ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్న అఖిల్, ఈ టీజర్‌లోనూ తన డాన్సుల టాలెంట్ ఇంకోసారి చూపించాడు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, అఖిల్ మేకోవర్. తొలి సినిమా ‘అఖిల్’, రెండో సినిమా ‘హలో’తో పోల్చితే, కొత్త మేకోవర్‌తో ఈ సినిమాలో కన్పిస్తున్నాడు అక్కినేని అఖిల్. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) చాలా బ్రైట్‌గా కన్పిస్తోంది.
రాత్రి 11.30 గంటలకు ఏం చేస్తున్నావ్? (Mr Majnu Teaser Review)
‘దీనింట్లో, మార్గరెట్ రూమ్‌లో రాత్రి 11.30 గంటలకు ఏం చేస్తున్నావ్?’ అని ఓ లేడీ క్యారెక్టర్, హీరోని అడిగితే.. ‘మీరు స్టూడెంట్‌గా వున్నప్పుడు స్ట్రెస్ ఫీలయినప్పుడు ఏం చేసేవారు?’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు హీరో. అటువైపునుంచి, ‘చాక్లెట్ తినేదాన్ని’ అని చెబితే, ‘ఆ రోజుల్లో చాక్లెట్‌తో పనైపోయేది.. కానీ, టుడేస్ స్ట్రెస్ లెవల్స్‌కి హ్యూమన్ టచ్ కావాలి..’ అని సమాధానమిస్తాడు హీరో.
డేంజరస్ క్యారెక్టర్..
మరో సీన్‌లో ‘డేంజరస్ క్యారెక్టర్ కదా అని హీరోని ఉద్దేశించి ఓ లేడీ క్యారెక్టర్, హీరోయిన్‌తో అంటే, ‘డేంజరస్ క్యారెక్టర్’ అని హీరోయిన్ బదులిస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో విద్యుల్లేఖ రామన్ నటించింది. ఈ సీన్‌లో అఖిల్ చూపులు, హీరోయిన్ చిరు కోపం బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు.
నా ఒక్కడి కోసం కాదు..
ఇంకో సీన్‌లో, ‘ప్రపంచంలో వున్న అందమైన అమ్మాయిలందరూ నా ఒక్కడి కోసం పుట్టలేదు నిక్కీ.. వాళ్ళకీ ఓ లైఫ్ వుంటుంది. అండ్ ఐ రెస్పెక్ట్ దట్..’ అంటూ హీరో చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్ అనుకోవాలేమో. డైలాగ్ చెబుతున్నప్పుడు అఖిల్ ఎక్స్‌ప్రెషన్స్ సూపర్బ్ అంతే.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్..
‘మిస్టర్ మజ్ను’ టీజర్‌కి తమన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పటికే విడుదలైన ఆడియో సింగిల్స్ మ్యూజిక్ లవర్స్‌ని అలరిస్తున్నాయి. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మూడ్‌కి తగ్గట్టుగా ఆయా సన్నివేశాల్లో తమన్ మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఒకలా, హీరోయిన్‌ని టీజ్ చేసే సీన్‌లో మరొకలా.. ఈ వేరియేషన్స్, వాటిల్లో క్వాలిటీ టీజర్‌కి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
సినిమాటోగ్రఫీ కెవ్వుకేక..
హీరోయిన్ నిధి అగర్వాల్, హీరో అక్కినేని అఖిల్.. ఈ టీజర్‌లో చాలా అందంగా కన్పించారు. ఆన్ స్క్రీన్ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా పండినట్లే అన్పిస్తోంది. ఈ పెయిర్‌ని మరింత అందంగా చూపడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. విజువల్స్ చాలా చాలా బావున్నాయి. అన్ని ఫ్రేమ్స్‌లోనూ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
డాన్సులు, ఫైట్స్ ఇరగదీసేశాడు.!
టీజర్‌లో (Mr Majnu Teaser Review) డైలాగ్స్‌ని తీసేస్తే, పాటలు – ఫైట్స్‌కి స్కోప్ చాలా తక్కువే కన్పించింది. లిప్త కాలం అలా వచ్చి వెళ్ళిపోయే యాక్షన్ ఎపిసోడ్‌లోనూ, డాన్స్ బిట్‌లోనూ అఖిల్ ఈజ్ స్పష్టంగా కన్పించింది. యాక్షన్ ఎపిసోడ్స్ అంటే అఖిల్‌కి వెన్నతో పెట్టిన విద్య అనుకోవాలేమో. గాల్లోకి అవలీలగా లేచి ఇచ్చే కిక్ సూపర్బ్ అంతే. ఓ సాంగ్ బిట్‌లో అఖిల్ షర్ట్ లెస్‌గా కన్పించాడు. ఈ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో అఖిల్ అలరించనున్న సంగతి తెల్సిందే.