Mrunal Thakur Gossips Affairs.. గాసిప్పులూ.. అందాల భామలూ.. అస్సలేమాత్రం విడదీయరాని సంబంధం వుంది ఈ కాంబినేషన్‌కి.!
ఏ వార్తా లేకపోతే, ఏదో ఒక హీరోయిన్ ఫొటో పెట్టుకుని, ఓ గాలి వార్త పోగెయ్.. అన్న డిస్కషన్ చాలా మీడియా సంస్థల్లో జరుగుతుంటుంది.
మెయిన్‌స్ట్రీమ్ మీడియా, వెబ్ మీడియా.. ఏదైనా అంతే.! సోషల్ మీడియా సంగతి సరే సరి.! అలా హీరోయిన్ల మీద రాత్రికి రాత్రి ‘పుకార్లు’ వేడి వేడిగా వండి, వడ్డించబడుతుంటాయి.
ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ కూడా ఈ గాసిప్పుల వంటకాల్లో ప్రధాన దినుసుగా మారిపోయింది.! ఇదిప్పటి మాట కాదు, ఎప్పటినుంచో మృణాల్ చుట్టూ గాసిప్స్ వింటూనే వున్నాం.
Mrunal Thakur Gossips Affairs.. సిన్మా హీరో.. క్రికెటర్.. తర్వాతెవరు.?
మొన్నేమో సినిమా హీరో ధనుష్, నిన్నేమో క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.. వార్తల్లెక్కారు, మృణాల్ ఠాకూర్ లవర్స్.. అనే ట్యాగ్‌తో.!
మృణాల్, ధనుష్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. సో, గాసిప్ వండి వడ్డించారంటే ఈ ఇద్దరి మీదా, అర్థం చేసుకోవచ్చు. శ్రేయాస్ అయ్యర్ సంగతేంటి.?
క్రికెటర్లకీ, సినిమా తారలకీ మధ్య ఎఫైర్లు కొత్తేమీ కాదు కదా.! అందుకే, మృణాల్ ఠాకూర్ – శ్రేయస్ అయ్యర్ మధ్య ఏదో వుందంటూ, గాసిప్ పుట్టించేశారన్నమాట.
Also Read: ఫ్యాషన్ ఐకాన్: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండీ సిగ్నేచర్.!
అయితే, ఈ గాసిప్స్‌ని మృణాల్ ఠాకూర్ కొట్టి పారేసింది. కో-స్టార్‌తో నటనకు సంబంధించిన స్నేహాలే వుంటాయని స్పష్టం చేసిందీ ముద్దుగుమ్మ.
శ్రేయస్ అయ్యర్‌తో గాసిప్ మాత్రం కడుపుబ్బా నవ్వు తెప్పించిందట మృణాల్ ఠాకూర్‌కి. నవ్వొచ్చిందని చెప్పినా, అదే సమయంలో ఒకింత చిరాకు కూడా వచ్చిందని మృణాల్ గుస్సా అయ్యింది.
తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాలతో ప్రస్తుతం బిజీగా వుంది మృణాల్ ఠాకూర్. సినిమా పనుల్లో క్షణం తీరిక లేకుండా వున్న తనకి, ఎఫైర్లు పెట్టుకునే అవకాశం ఎక్కుడుందంటూ కిసుక్కున నవ్వేసిందీ భామ.
