Table of Contents
Mrunal Thakur Gym Glamour.. తెలుగు తెరపైకి ‘సీతారామం’ సినిమాతో సంచలనంలా దూసుకొచ్చింది మృణాల్ ఠాకూర్.! హైద్రాబాద్ నా సెకెండ్ హోమ్.. అని అంటుంటుంది మృణాల్.
ఔను, అంతలా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేసింది ఈ బ్యూటీ.! కాకపోతే, కాస్త బొద్దుగా.. మరింత బొద్దుగా తయారైపోయి.. అవకాశాల్ని చేజార్చుకుంటూ వచ్చింది.
ఎలా దూసుకొచ్చిందో, అలా ఫేడౌటయిపోయే ప్రమాదం కొనితెచ్చుకుంది మృణాల్. ఎలాగైతేనేం, మళ్ళీ సన్నబడేందుకు కసరత్తులు చేసింది.
Mrunal Thakur Gym Glamour.. బొద్దుగుమ్మ చిక్కినా అందమే..
నిజానికి, కాస్త బొద్దుగా వుంటేనే బావుంటారు హీరోయిన్లు. మృణాల్ లాంటి ముద్దుగుమ్మలకి ఆ బొద్దుతనం అదనపు అందాన్ని తెచ్చిపెడుతుంది.

అయితే, బొద్దుగా మారిపోవడానికి అనేక కారణాలుంటాయ్.. వర్కవుట్స్ చేయకపోవడమే కాదు, శరీరతత్వం కూడా కొందరు బొద్దుగా మారేలా చేస్తుంటుంది.
అయినా, హీరోయిన్ అంటే జీరో సైజ్ ఫిజిక్ మాత్రమేనా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. సన్నగా రివటలా వుండే హీరోల పక్కన, కాస్త బక్క పలచగా వుంటేనే అందం అనుకోండి.
శరీర తత్వమే అంత..
ఈ బొద్దుతనం, బక్కతనం మీద.. బోల్డంత రచ్చ జరుగుతూనే వుంటుంది ఎప్పుడూ.! తన బొద్దుతనం గురించి, గతంలో పలు సందర్భాల్లో మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చేసింది.
తన శరీర తత్వమే అంత అనీ, బొద్దుగా వున్నా ఆరోగ్యంగానే వుంటాననీ.. అదే తనకు అందమనీ మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఈ మధ్య కొన్ని యాక్షన్ గర్ల్ రోల్స్, మృణాల్ ఠాకూర్ దగ్గకి వెళుతున్నాయట. దాంతో, సన్నబడక తప్పడంలేదనీ, ఈ క్రమంలోనే ఎక్కువ టైమ్ జిమ్‌కి ఆమె కేటాయిస్తోందనీ సమాచారమ్.
సినిమా కోసం ఏదైనా..
జిమ్ ఒక్కటే కాదుట.. డాన్స్ చేయడం, స్విమ్ చేయడం కూడా.. ఫిజిక్ పెర్‌ఫెక్ట్‌గా వుండేలా చేస్తాయని మృణాల్ ఠాకూర్ చెబుతుంటుంది.
Also Read: కన్నప్పా.. నిన్నెవరు ఎత్తుకెళ్ళారప్పా.?
సోషల్ మీడియా అన్నాక ట్రోలింగ్ సహజం.! కొందరు ఈ ట్రోలింగ్‌ని లైట్ తీసుకుంటారు, ఇంకొందరు సీరియస్‌గా తీసుకుంటారు.
ఇంతకీ, మృణాల్ ఠాకూర్ ఏ టైపు.? ట్రోలింగ్ సంగతెలా వున్నా, సినిమా కోసం అవసరమైతే, ఏమైనా చేస్తానంటుంది మృణాల్ ఠాకూర్. అదే ఆమె స్పెషల్.