Nabha Natesh Darling Priyadarshi.. డార్లింగ్.. అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రబాస్. కానీ, ఇప్పుడు ప్రియదర్శిని కూడా గుర్తు చేసుకోవాలి. అదేంటీ.? అంటారా.?
అవునండీ.! ప్రియదర్శి ఈ ‘డార్లింగ్’ పేరును లాగేసుకున్నాడిప్పుడు.
ఎందుకంటారా.? తన కొత్త సినిమా కోసం. ప్రియదర్శి నటిస్తున్న తాజా సినిమా టైటిల్ ‘డార్లింగ్’. అసలే డార్లింగ్ అనే సౌండ్‌లోనే అదో వైబ్రేషన్.
అలాంటి వైబ్రేషన్ వున్న టైటిల్‌ని తన సినిమాకి పెట్టేసుకున్నాడు ప్రియదర్శి. అసలింతకీ ‘డార్లింగ్’ కథేంటీ.?
Nabha Natesh Darling Priyadarshi.. క్రేజీ కాంబినేషన్ డార్లింగ్.!
ఇదో లవ్ స్టోరీ. ఓహో.! లవ్ స్టోరీనే కదా.. కొత్తగా ఏముంటుందిలే అనుకుంటారా.? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లేనండోయ్.
ఓ కొత్త రకం లవ్ స్టోరీని ఇంతకు ముందెప్పుడూ చూడని లవ్ స్టోరీని తన ‘డార్లింగ్’ సినిమా ద్వారా చూపిస్తానంటున్నాడు ప్రియదర్శి.
ఇంతకీ ప్రియదర్శి డార్లింగ్ ఎవరు.? అదేనండీ ఈ సినిమాలో హీరోయిన్..! ఇంకెవరు ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. లాంగ్ గ్యాప్ తర్వాత నభా నటేష్ నటిస్తున్న చిత్రమిది.

అదేంటీ.! నభా నటేష్, ప్రియదర్శి కాంబినేషనా.? క్రేజీ కదా.! అనుకుంటున్నారా.? అంతేగా.! ఈ క్రేజీ లవ్ స్టోరీ నచ్చేసి నభా నటేష్ వెంటనే ఓకే చేసేసిందట.
ఈ సినిమాతో నభా నటేష్ బౌన్స్ బ్యాక్ అవుతుందనిపిస్తుంది. సినిమా రిలీజ్ డేట్ ఇంకా తెలీదు కానీ, ప్రమోషన్లయితే ఊదరగొట్టేస్తున్నారప్పుడే.
ఈ లవ్ స్టోరీ కాస్త డిఫరెంట్ గురూ.!
గత కొన్ని రోజులుగా ఈ టైటిల్ ప్రమోషన్ చాలా చిత్రంగా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా హీరో, హీరోయిన్లు ప్రియదర్శి, నభా నటేష్ ‘డార్లింగ్.. డార్లింగ్..’ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
వీరిద్దరి మధ్యలోకీ తెలుగమ్మాయ్ రీతూ వర్మ కూడా వచ్చి చేరింది. దాంతో, రీతూ వర్మ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తోందా.? అన్న అనుమానాలూ వున్నాయ్.
లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హీరో ప్రియదర్శి మోకాలిపై కూర్చొని, హీరోయిన్ నభా నటేష్‌కి లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లుగా వున్న లుక్ అది.
అబ్బో.! చాలా కామన్.. ఎన్ని లవ్ ప్రపోజల్స్ చూడలేదిలా.! అనుకుంటున్నారా.? కాస్త డీప్‌గా అబ్జర్వ్ చేయండి.
ఏ ఫ్లవరో, రొమాంటిక్ గిఫ్టో ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటే మీరనుకున్నట్లే.! వెరీ కామన్. కానీ, ఈ లుక్‌లో తాళి బొట్టుతో హీరో తన లవ్‌ని ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అది కదా ‘డార్లింగ్’ అంటే.!
అందుకే కదా ఈ లుక్ ఇప్పుడు అంత వైరల్ అవుతోంది. ఈ లుక్‌తో ఆపలేదండోయ్. అమ్మ నుంచి మొదలుపెట్టి, చెల్లి, లవర్.. పెళ్లాం వరకూ తన అభిప్రాయాలు తెలియచెప్పి.. మనోడు చేసని పర్‌ఫామెన్స్ సూడాలా.!
కొన్ని నిమిషాల పాటు రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ప్రియదర్శి స్టైల్‌లో వుంది. అమ్మగా ప్రేమ చూపించి, చెల్లిగా సపోర్ట్ ఇచ్చి, లవర్‌లా క్యూట్ అప్పీల్ ఇచ్చి.. భార్య రూపంలో మొగుడి తాట తీసి తండూరీ చేసేస్తార్రా.. అంటూ
హీరోయిన్ ఎంట్రీకి ఇచ్చిన బిల్డప్.. హిలేరియస్. గ్లింప్స్ స్టార్టింగ్‌లోనే ఎవ్వరి భార్యల మనోభావాలు దెబ్బ తినకూడదంటూ హెచ్చరిక ఇంకా ఎట్రాక్టివ్‌గా అనిపిస్తోంది.
అశ్విన్ రామ్ ఈ సరికొత్త లవ్ స్టోరీకి దర్శకుడు. ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిరంజన్ రెడ్డి నిర్మాత.