Nandamuri Balakrishna Anjali Touch.. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు కూడా.!
తెలుగు దేశం పార్టీలో కీలక నేత కూడా అయిన నందమూరి బాలకృష్ణ, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.?
ప్చ్.. ఇంతకీ, నందమూరి బాలకృష్ణ ఏమైనా బాధ్యత తప్పి వ్యవహరించాడా.? అసలేంటి కథ.? ఎందుకింత రచ్చ జరుగుతోంది.
అదేంటో, నందమూరి బాలకృష్ణకి కోపం కాసింత ఎక్కువే.! అభిమానుల చెంప పగలగొట్టడంలో బాలయ్యకు సాటి ఇంకెవరూ రారు.
అందుకే, బాలయ్యకి కొందరు కాస్త దూరంగా వుంటారు. కానీ, చాలామంది ఆయనకు చాలా చాలా దగ్గరగా వుంటుంటారు. అదే బాలయ్య ప్రత్యేకత.
Nandamuri Balakrishna Anjali Touch.. బాలయ్యకి కోపమెక్కువే..
బాలయ్యతో ఫొటోల కోసం మీద మీద పడిపోతోంటే, బాలయ్యకు కోపమొస్తుంటుంది. అద్గదీ, ఆ చెంపదెబ్బల వ్యవహారం. ఊరికే ఇరిటేట్ అయిపోతుంటారాయన.
అదే సమయంలో, బాలయ్యకి సహనం కూడా ఎక్కువే. అదో రకమైన వ్యక్తిత్వం నందమూరి బాలకృష్ణది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణలో నందమూరి బాలకృష్ణ చూపే శ్రద్ధ, బాధ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఊరికే, ఏదో ఓ చిన్న ఘటనతో బాలయ్యని తూలనాడేయడం కరెక్ట్ కాదు. అదే సమయంలో, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడమూ తప్పు కాదు.
అసలు విషయంలోకి వస్తే, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, సినీ నటి అంజలిని బాలయ్య తోసేసిన మాట వాస్తవం.
అది, జస్ట్ సరదా వ్యవహారం.. అంటున్నారు బాలయ్య అభిమానులు. వీడియో మొత్తం చూస్తే, అదే నిజమనీ అనిపిస్తుంది.
తాగిన మైకంలో..నా..!?
అయితే, బాలయ్య తప్పతాగి, ఆ మైకంలో పిచ్చిపిచ్చిగా వ్యవహరించేశాడన్నది ఇంకో వాదన. బాలయ్య కూర్చున్న చోట వున్న ఓ వాటర్ బాటిల్‌లో ‘మద్యాన్ని’ పోలినట్టుగా, ‘కలర్’ కనిపించడం ఈ వివాదానికి కారణం.
కొన్నాళ్ళ క్రితం ఓ సినిమా ఈవెంట్‌లోనే, బాలయ్య ఓ వ్యక్తి (సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే) సెల్ ఫోన్ లాక్కుని, విసిరేసిన వైనం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
Also Read: అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి పారిపోయిన నాగబాబు.?
ఇక, అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వ్యవహారంపై పెద్ద క్లాస్ పీకారు.
మరి, అంజలి విషయంలో ఇలా బ్యాడ్ టచ్ ఎందుకు ప్రదర్శించావ్.? అని బాలయ్యని చాలామంది నిలదీస్తున్నారు.