భూమి తర్వాత, మనిషి జీవించడానికి కాస్తో కూస్తో అనువుగా వుంటుందేమోనని భావిస్తోన్న గ్రహం అంగారకుడు (మార్స్). అందుకే, ఎన్నో ఏళ్ళుగా అంగారకుడి మీద ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా అంగారకుడి మీదకు నాసా ప్రయోగించిన రోవర్ ‘పర్సెవరెన్స్’ (Nasa Perseverance On Mars) విజయవంతమయ్యింది.
ఈ రోవర్ (Nasa Perseverance On Mars) తాజాగా అంగారకుడి మీద దిగింది. అంగారకుడి మీద రోవర్ దిగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రోవర్ దిగడంతోనే నాసా ప్రయోగ శాలలో సైంటిస్టులు ఆనందోత్సాహాలతో చిందేశారు.
రోవర్ అంగారకుడిపై దిగీ దిగడంతోనే కొన్ని ఫొటోల్ని పంపింది. ఈ రోవర్, మార్స్ ఈక్వేటర్ (మధ్య రేఖ) సమీపంలో వున్న లోతైన బిలం (జెజెరో అని వ్యవహరిస్తున్నారు) వద్ద ల్యాండ్ అయ్యింది.

మొత్తం ఆరు చక్రాలు ఈ పర్సెవరెన్స్ రోవర్‌లో వుంటాయి. రెండేళ్ళకు పైనే ఈ రోవర్ అంగారుకుడిపై పరిశోధనలు చేసే అవకాశం వుంది. ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశ్యం అంగారకుడి మీద జీవం వుందా.? నీరు వుందా.? అనేవి తేల్చడమే. అక్కడున్న రాళ్ళు, ఉపరితలాన్ని విశ్లేషించనుంది రోవర్.
జెజెరో ప్రాంతంలో ఓ సరస్సు వుండి వుండేదన్నది శాస్త్రవేత్తల భావన. అయితే అది బిలియన్ల సంవత్సరాల క్రితం వుండి వుండొచ్చని భావిస్తుండడంతో, అక్కడ నీటి జాడ కనుగొడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అంగారకుడి మీద మనిషి ఆలోచనలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వున్నాయి.
అనేక వ్యయప్రయాసలకోర్చి అంగారకుడిపై (Nasa Perseverance On Mars) జీవం వుందా.? లేదా.? అన్నది తేల్చేందుకు ప్రపంచంలో పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. జీవం వుండి వుండకపోవచ్చనీ, అయితే అక్కడ మనిషి జీవించడానికి కాస్తో కూస్తో అనుకూల పరిస్థితులు వుండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దాంతో, సహజంగానే మనిషికి అంగారకుడి మీద ఆశలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎప్పటికప్పుడు మనిషి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. అంతరిక్ష యాత్రలనేవి ప్రయోగాల నిమిత్తం ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి.
చంద్రుడి మీదకు వెళ్ళే ప్రయోగాలకు మధ్యలో కొంత బ్రేక్ పడినా.. మళ్ళీ జాబిల్లిని అందుకోవడానికి మనిషి పరుగులు పెడుతున్నాడు. అంగారకుడి విషయంలోనూ ఈ తరహా ప్రయోగాలు (Nasa Perseverance On Mars) మునుపటితో పోల్చితే మరింత జోరుగా సాగుతున్నాయి.