Nayanthara Vignesh Shivan.. పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటే ఇదేనా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్ళి అంటే ఒకప్పుడు పండగ. ఇప్పుడు అంతకు మించిన పండగ.!
కానీ, పండగలోనే కొంత తేడా వుంది. వధూ వరులు పెళ్ళి పీటల మీద కూర్చోవడం.. పురోహితుడు ఆ పెళ్ళి తంతుని సంప్రదాయబద్ధంగా జరపడం.. ఇదీ అసలు వేడుక.
కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. పురోహితుడు ఏం మంత్రాలు చదువుతున్నాడన్నది అనవసరం. ఈ మొత్తం తతంగాన్ని వీడియో చిత్రీకరణ చేసేవాడే మొత్తం డైరెక్షన్ చేసేస్తాడు.
‘పంతులుగారూ ఇటు చూడండి.. పెళ్ళికూతురుగారూ ఇలా లుక్కేసుకోండి.. పెళ్ళికొడుకుగారూ అలా నవ్వండి..’ అంటై డైరెక్షన్ చేస్తున్నాడు.
వీడియో షూట్ చేసే వ్యక్తి.. అచ్చం సినిమాటోగ్రాఫర్‌లా వ్యవహరిస్తోంటే.. దీనంతటినీ ఓ దర్శకుడు డిజైన్ చేస్తుండడం కూడా చూస్తున్నాం.
పెద్దపెద్ద పెళ్ళిళ్ళలో ఈ తంతు మరీ దారుణంగా తయారైంది. పెళ్ళి మూణ్నాళ్ళ ముచ్చటే అవుతోంది ఈ రోజుల్లో.
ఘనం అంటే ఇదే మరి.!
అయినాగానీ, ఆ పెళ్ళి తంతు ఘనంగా కనిపించాలి.. వందలాది మంది, వేలాది మంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆ వ్యవహారం నడవాలి మరి.!

మూడు నెలలకో, ఆరు నెలలకో విడాకులు.. అన్నది వేరే చర్చ. సంప్రదాయ బద్ధంగ చేసిన పెళ్ళిళ్ళు మాత్రం కలకాలం నిలబడిపోతున్నాయా.? ఏంటీ.? అంటే, సమాధానం చెప్పడం కష్టమే.
అన్నట్టు, నయనతార – విఘ్నేష్ శివన్ చాలాకాలం సహజీవనం తర్వాత పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
పెళ్ళి తంతు విషయమై ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో సంప్రదింపులు జరిపాడట. ఆయన ఆ మొత్తం తతంగాన్ని డిజైన్ చేస్తాడట. ఈ మొత్తం ‘తంతు’, ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతుందట.
Nayanthara Vignesh Shivan.. ఇంతకీ, శోభనం సంగతేంటి చెప్మా.!
అదిరింది కదూ.! పెళ్ళి తంతు సరే, శోభనం సంగతేంటి.? దాన్ని కూడా ఎవరైనా దర్శకుడు డిజైన్ చేస్తాడా.?
నయనతార – విఘ్నేష్ శివన్‌ల పెళ్ళి వ్యవహారం సంగతి సరే, సాధారణంగానే జరుగుతున్న పెళ్ళి తతంగాలు, అనంతరం జరిగే శోభనం వ్యవహారాల మాటేమిటట.?
Also Read: పద్ధెనిమిదేళ్ళ కష్టం.! నగ్మా ‘కష్టం’ సరిపోలేదేమో.!
ప్రీ వెడ్డింగ్ షూట్ తరహాలో.. పోస్ట్ వెడ్డింగ్ షూట్.. అదేనండీ ప్రీ శోభనం షూట్ కూడా షురూ అయ్యింది.
పెళ్ళి తంతులా శోభనం తంతుని చిత్రీకరించడానికి కాస్త మొహమాటపడుతున్నట్టున్నారు. ముందు ముందు ఆ ముచ్చట కూడా కామన్ అయిపోతుందేమో.!