Table of Contents
NBK About Padmabhushan Award.. భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న. ఆ తర్వాత పద్మ విభూషణ్. మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్.!
ఈ మూడో అత్యున్నత పౌర పురస్కారం, ఇటీవల సినీ నటుడు నందమూరి బాలకృష్ణను వరించిన విషయం విదితమే.
సినీ రంగంలో ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల నేపథ్యంలో ఈ పౌర పురస్కారం ఆయన్ను వరించింది.
కానీ, సేవా రంగంలో బాలయ్యకు ఈ పురస్కారం లభించి వుంటే మరింత బావుండేదన్నది ఆయన్ని అభిమానించే కొందరి అభిప్రాయం.
NBK About Padmabhushan Award.. బాలయ్యా.. అలా అనొచ్చా.?
‘వాళ్ళేదో తెలియక ఇచ్చేశారు..’ అంటూ నందమూరి బాలకృష్ణ తాజాగా, ‘పుసుక్కున’ నోరు జారేశారు. తన పుట్టినరోజు సందర్భంగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుప్రతిలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి వున్న ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం గురించి కొత్తగా చెప్పేదేముంది.?
బాలయ్య నిర్వహణలో, బసవ తారకం ఆసుపత్రి ఎంతోమంది క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించిందన్నది కాదనలేని వాస్తవం.
తేలిక వ్యాఖ్యలు.. బాధ్యతారాహిత్యమే.!
అయినాగానీ, ‘తెలియక ఇచ్చేశారు’ అంటూ పద్మ భూషణ్ పురస్కారం గురించి తేలిక వ్యాఖ్యలు చేయడం నందమూరి బాలకృష్ణకి తగదు.
ఏ రంగంలో ఎవరికి ఏ పురస్కారం ఇవ్వాలి.? అన్నదానిపై అవార్డుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అన్నీ పరిశీలించాకే, పురస్కారాల ప్రకటన జరుగుతంది.
వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య, తన నటనా ప్రతిభకు పురస్కారం దక్కితే.. ‘తెలియక ఇచ్చారు’ అనడం, అస్సలు బాలేదన్న చర్చ ఆయన అభిమానుల్లోనూ వినిపిస్తోంది.
అలంకారం.. పురస్కారం..
ఇక్కడ, బాలయ్య ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. ‘అవార్డులు నాకు అలంకారం కాదు.. నేనే అవార్డులకు అలంకారం..’ అని అన్నారాయన.
ఈ మాట ఎవరైనా అంటే బావుంటుందిగానీ, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత నందమూరి బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు చేయకూడదు.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
పద్మ భూషణ్ అంటే, సాదా సీదా పురస్కారమేమీ కాదు కదా.! భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోది.
సినిమాటిక్ డైలాగులతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన అభిమానుల్ని అలరించాలనుకుంటే.. అది వేరే వ్యవహారం.
కానీ, అవార్డుల విషయంలో అవార్డు గ్రహీతలు ఒకింత గౌరవ భావంతో వ్యవహరిస్తే, అది హుందాతనం అనిపించుకుంటుంది.