Home » నయా ట్రెండ్.! టూత్ బ్రష్ స్థానంలోకి ‘వేప పుల్ల’.!

నయా ట్రెండ్.! టూత్ బ్రష్ స్థానంలోకి ‘వేప పుల్ల’.!

by hellomudra
0 comments
Neem Stick

Neem Stick Tooth Brush.. ‘మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.?’ అంటూ ఆ మధ్య ఓ కమర్షియల్ యాడ్, బుల్లితెరపైనా వెండితెరపైనా.. యూ ట్యూబ్‌లోనూ కనిపించేది.!

సినీ ప్రముఖులు, షడెన్‌గా ప్రత్యక్షమైపోయి ‘మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.?’ అని అడిగేవారు.. ఆ ప్రకటనల్లో. కాజల్ అగర్వాల్ సహా పలువురు సినీ ప్రముఖులు, ఆ ప్రకటనల్లో నటించారు.

ఆ తర్వాత, మీ టూత్ పేస్టులో బొగ్గు వుందా.. అన్న కోణంలో కొత్త తరహా ప్రకటనలు డిజైన్ చేశారు. టూత్ పేస్టుల సంగతి పక్కన పెడితే, టూత్ బ్రష్సుల్లో మళ్ళీ బోల్డన్ని రకాలు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని వినియోగించి కూడా టూత్ బ్రష్సుల్ని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్న రోజులివి.

Neem Stick Tooth Brush.. మూలాల్ని వెతుక్కుంటున్నాం.. వేప పుల్లని కొనుక్కుంటున్నాం..

ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు, మళ్ళీ వెనక్కి వెళుతున్నాం.. మూలాల్ని వెతుక్కుంటున్నాం. వేప పుల్లలతో బ్రష్ చేసుకోవడం మంచిదని కొందరు, ఆ దిశగా అడుగులేస్తున్నారు.

చిత్రమేంటంటే, ఈ వేప పుల్లలు కూడా మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయిప్పుడు. ఆన్‌లైన్లోనూ అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి.

ఇలా బుక్ చేస్తే, అలా ఇంటికి వచ్చేస్తున్నాయి ఈ ఆన్‌లైన్ వేప పుల్లలు. అదేంటీ, ఇంటి పక్కనే వేప చెట్టు వుంది కదా.? ఆన్‌లైన్‌లో వేప పుల్లల అవసరమేంటి.? అనే డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కాదు.

కానీ, మనకి ఇంటి దగ్గర దొరికే వేప పుల్లలు ఆర్గానిక్ కాదట. ఆన్‌లైన్‌లో దొరికేవి మాత్రమే ఆర్గానిక్ అట. ఆర్గ్యుమెంట్ భలే వుంది కదా.! ఇది యాపారం.. ఎన్నయినా చెబుతారు ఇలాంటివి.

వేప చెట్టుకి తెగుళ్ళు..

అన్నట్టు, వేప చెట్లకూ గత కొంతకాలంగా చిత్రమైన తెగుళ్ళు వస్తున్నాయ్. వున్నపళంగా ఆకులు ఎండిపోతున్నాయ్.. కొమ్మలకు కొమ్మలు పాడైపోతున్నాయ్.

ఇటు వేప పుల్లలకు డిమాండ్ పెరుగుతుండడం.. అటు వేప చెట్లు పాడైపోతుండడం.. వింతగా వుంది కదా.!

వేపలో చాలా ఔషధ గుణాలున్నాయ్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మనం నిర్లక్షం చేసిన వేప, ఇప్పుడు మనకి అవసరమవుతోంది.!

Also Read: ఆకాశంలో క్రీడీ మైదానం! ఎడారి దేశంలో అద్భుతం!

మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.. అనే ప్రకటన సంగతి పక్కన పెడితే, ‘మీ ఇంట్లో వేప పుల్ల వుందా’ అని ట్రెండీగా మనం మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అడిగే రోజు రావొచ్చు.!

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, వేప పుల్లతో పళ్ళు తోముకోవడం వల్ల నోటి ఆరోగ్యమే కాదు.. పొట్ట ఆరోగ్యమూ మెరుగవుతుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group