Table of Contents
Niharika Konidela Divorce.. పాత్రికేయం అన్నది వ్య..భిచారం కంటే జుగుప్సాకరంగా తయారైందని పదే పదే చెప్పుకోవాల్సిన దుస్థితి.!
‘ది గ్రేట్ పాత్రికేయ వ్య..భిచారం.’ ఇంకోసారి వెర్రి తలలు వేసింది. అసలు విషయమేంటంటే సినీ నటి నిహారిక, తన భర్త నుంచి విడాకులు తీసుకుంటోందిట. అలాగని ఓ గాసిప్ పుట్టుకొచ్చింది.
సినీ రంగం అన్నాక ఇలాంటి గాసిప్స్ కొత్తేమీ కాదు.! ఇప్పుడున్న ట్రెండ్‌లో విడాకులూ కొత్త కాదు.! నిహారిక, ఆమె భర్త చైతన్య నిజంగానే విడాకులు తీసుకోనున్నారా.? లేదంటే, ఇదంతా ఉత్త ప్రచారమా.? అన్నది ముందు ముందు తేలుతుంది.
Niharika Konidela Divorce.. ఫొటోలు తొలగిస్తే.. అంతేనా.?
చైతన్య సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి నిహారిక ఫొటోలు తొలగించబడ్డాయట. నిహారిక కూడా ఫొటోల్ని తీసేసిందన్నది సదరు గాసిప్ సారాంశం.
కొన్నాళ్ళ క్రితం రానా దగ్గుబాటి విషయంలోనూ ఇలాంటి దుష్ప్రచారమే జరిగింది. రానా – మిహీక.. కలిసే వున్నారు. నిహారిక విషయంలో ఏం జరుగుతుందో ఏమో.!
అయితే, ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, మెగా కుటుంబానికి ఏదో శాపమంటూ వెకిలి ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది ‘ది గ్రేట్ పాత్రికేయ వ్య..భిచారం’.!
ది గ్రేట్ పాత్రికేయ వ్య..భిచారం..
ఇంతకీ, ఆ ‘ది గ్రేట్ పాత్రికేయ వ్య..భిచారం’ ఇంట్లో అంతా సజావుగానే వుందా.? విడాకుల శాపం ఆ పాత్రికేయ కుటుంబాినకీ పట్టిందా.? అయినా, ఇందులో మెగాస్టార్ చిరంజీవికి ఏంటి సంబంధం.?

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక. సరే, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయన కుమార్తె శ్రీజ విడాకులపై చర్చ జరుగుతోందనుకోండి.. అది మళ్ళీ వేరే చర్చ.
మోహన్‌బాబు తనయుడు మనోజ్, పెళ్ళి చేసుకున్నాడు.. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, ఇటీవలే రెండో పెళ్ళి చేసుకున్నాడు. సినీ పరిశ్రమలో చాలా కుటుంబాల్లో ఇలాంటివి చూస్తున్నాం.
సినిమా రంగంలో మాత్రమేనా.?
సినిమా రంగంలోనేనా.? రాజకీయ రంగంలో.. ఆ మాటకొస్తే, సాధారణ సమాజంలోనూ విడాకులు.. మళ్ళీ పెళ్ళి.. అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. ఇందులో ‘శాపం’ అనడానికేముంది.? ఏడుపు కాకపోతే.!
తారల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అనేది ఓ జాడ్యం.! దీన్ని ఓ మానసిక రోగంగా కూడా భావించొచ్చేమో. గాసిప్స్‌కి కూడా ఓ హద్దు వుంటుంది. ఆ హద్దులు దాటడమంటే.. అంతకన్నా జుగుప్స ఇంకోటుండదు.
Also Read: మాస్ అమ్మ మొగుడు.! ఎన్టీయార్‌కే ధమ్కీ ఇచ్చినవ్.!
పాఠకుల, వీక్షకుల ఆసక్తికి తగ్గట్టుగా వార్తల్ని మలచడం అనేది ఓ ‘కళ’ కావొచ్చుగాక.! కానీ, అది అత్యంత అభ్యంతరకరంగా మారిపోవడమే శోచనీయం. పాత్రికేయం ముసుగులో వ్య..భిచారం చేస్తామంటే కుదరదిక్కడ.!
గురివింద తన ము..డ్డి కింద నలుపుని ఎరగదట.! ది గ్రేట్ పాత్రికేయ వ్య..భిచారం కూడా.. తన ము..డ్డి కింద నలుపుని ఎరగడంలేదంతే.!