Niharika Konidela New Avatar.. కొత్తగా.. సరికొత్తగా.! నిహారిక తాజా గ్లామర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సరికొత్త గ్లామర్‌తో నిహారిక పోస్ట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
ఇంతకీ, నిహారికలో (Niharika Konidela) ఎందుకింత మార్పు.? హీరోయిన్‌గా అవకాశాల కోసమా.? కొత్త ఇన్నింగ్స్ హీరోయిన్‌గా షురూ అవుతుందా.?
అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోందట నిహారిక. అందుకే ఈ కొత్తందాల ప్రచారం అనీ మాట్లాడుకుంటున్నారు.
Niharika Konidela New Avatar.. అందాల ఆరబోత సరే.. ‘ఆ’ ముచ్చట ఏంటీ నిహారికా.?
కొత్తగా, సరికొత్తగా తనలోని గ్లామర్ యాంగిల్స్ ఎలివేట్ చేస్తూ నిహారిక సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. కుర్రోళ్ల మతులు పోగొడుతోంది.

అంతా బాగానే వుంది. కానీ, నిహారిక (Niharika Konidela) విడాకుల ముచ్చట ఏమైనట్లు.? అది ఇంకా సస్పెన్స్‌గానే వుంది. అధికారికంగా బయటికి రాలేదు కానీ, నిహారిక విడాకులు ఖాయమనే ఇన్‌సైడ్ టాక్.
సెకండ్ ఇన్నింగ్స్ దబిడి దిబిడే..
ఈ క్రమంలోనే మళ్లీ యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టిందట. ఇప్పటికే చాలా కథలు వినిందట. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదట కానీ, త్వరలోనే ఓ బెస్ట్ ప్రాజెక్ట్‌తో రాబోతోందనీ తెలుస్తోంది.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హీరోయిన్‌గా ఫెయిలైంది. ఈ సారి పక్కాగా ప్లాన్ చేసుకుంటోందట. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలన్న కసితో వుందట నిహారిక కొణిదెల.
Also Read: అప్పుడు వద్దన్నావట.! ఇప్పుడు ఎగబడుతున్నావట.!
ఇటీవల ‘డెడ్ పిక్సల్స్’ అను ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. అది ఫెయిల్ అయ్యింది. మరికొన్ని వెబ్ సిరీస్‌లు కూడా లైన్‌లో వున్నాయట. ఏది ఏమైనా నిహారిక స్కెచ్ ఈ సారి మామూలుగా వుండదనీ తెలుస్తోంది.

సోషల్ మీడియా ట్రోలింగ్‌ని పట్టించుకుంటే.. సెలబ్రిటీలు కెరీర్‌లో ముందడుగు వేయలేరన్నది నిర్వివాదాంశం.
నిజానికి, సోషల్ మీడియా ట్రోలింగ్ అంటే, అదొక వేలం వెర్రిలా తయారైపోయింది.! ఈ ట్రోలింగ్‌కి బాధితులు కాని వారు ఎవరూ లేరనడం అతిశయోక్తి కాదేమో.!