Niharika NM Tollywood Entry.. ఎవరీ నిహారిక.. ఏమా కథ.? ఈ నిహారిక, కొణిదెల నిహారిక కాదు.1 ఈమె వేరు. పుట్టింది తమిళనాడులో అయినా, బెంగళూరుకి చెందిన బ్యూటీ ఈ నిహారిక.
మహేష్‌బాబు, ఆమిర్ ఖాన్.. ఇలా పలువురు స్టార్లను వారి వారి సినిమాల విడుదల సమయంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేసిన నిహారిక, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది చాలాకాలం క్రితమే.

స్కూల్‌కి వెళ్ళే వయసులోనే, యూ ట్యూబ్ వీడియోలతో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అలాగని, చదువుల్ని నిహారిక అస్సలు నిర్లక్ష్యం చేయలేదు. ఉన్నత విద్యనీ అభ్యసించింది.
ఓ దశలో యూ ట్యూబ్ వ్యవహారాల వల్ల చదువుకి ఇబ్బంది కలగడంతో, కొన్నాళ్ళపాటు సోషల్ మీడియాకి దూరంగా వుంది.. అదీ అయిష్టంగానే.!
Niharika NM Tollywood Entry.. చదువుల్లో టాపర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్..
చదువుల్లో టాపర్‌గా కొనసాగుతూనే, యూ ట్యూబ్‌లో సంచలనంగా ఎదిగింది. యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీకి తిరుగులేని ఫాలోయింగ్ వుంది.
మొన్నీమధ్యనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ సందడి చేసింది నిహారిక. అలా ఆ వేదికపై కనిపించే అరుదైన గౌరవాన్ని నిహారిక దక్కించుకుంది.

ఇప్పుడీ నిహారిక తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. అదీ, ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతోంది.
లక్కు తోక తొక్కిందంతే..
తెరంగేట్రమే, గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ ద్వారా అంటే చిన్న విషయం కాదు. దటీజ్ నిహారిక.. అంటున్నారు ఆమె అభిమానులు.
Also Read: తమిళ రాజకీయాల్లోకి త్రిష తెరంగేట్రం.?
ముచ్చటైన మాటలతో, హై ఓల్టేజ్ ఎనర్జీతో, పంచ్ డైలాగుల్లో మంచి టైమింగుతో.. యూ ట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారిన నిహారిక, వెండితెరపైనా వెలిగిపోతుందా.? స్టార్‌డమ్ దక్కించుకుంటుందా.?

ఏమో, సినిమా అంటేనే మ్యాజిక్.! లక్కు ఫేవర్ చేసిందంటే, నిహారిక (Niharika NM).. సినీ రంగంలో దూసుకుపోవడం ఖాయమే. ఆల్ ది బెస్ట్ నిహారిక.!