Table of Contents
Nivetha Pethuraj అంటే, తెలుగు అలాగే తమిళ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. నటిగా మంచి మార్కులేయించుకోవడం ఓ యెత్తు.. అదే సమయంలో, ఇతరత్రా వ్యాపకాలతో ఎప్పుడూ బిజీగా వుంటుంది. ఫార్ములా వన్ రేసింగ్ పోటీల మీద ఆసక్తి, మార్షల్ ఆర్ట్స్ మీద మమకారం.. నివేదా పేతురాజ్ గురించి ఇంకా చాలా వుంది తెలుసుకోవాలి్సందే.
చిన్నతనంలో.. అంటే తనకు ఐదేళ్ల వయసున్నప్పుడే లైంగిక వేధింపులకు గురైందట అందాల భామ నివేదా పేతురాజ్. ఆ విషయాన్ని తల్లితండ్రులకు ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యిందట. అయితే, అది ఒకప్పటి మాట.. ఇప్పుడైతే.. నివేదా పేతురాజ్ ఓ ఫైటర్.
Nivetha Pethurajతో పెట్టుకుంటే అంతే..
ఆశ్చర్యపోతున్నారా.? కేవలం వెండితెరపై గ్లామర్ తళుకులతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మలో చాలా తెలియని టాలెంట్స్ ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఆశక్తి అట. ఆ ఆశక్తితోనే కరాటే, కుంగ్ ఫూ, టేక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్‌తో పాటు, జపాన్‌కి చెందిన జుజిట్సూ అను ఓ సరికొత్త యుద్ధ విద్యలో శిక్షణ తీసుకుందట నివేదా పేతురాజ్.

ఈ మార్షల్ ఆర్ట్స్ తనలో ధైర్యాన్ని నింపాయంటోంది. అందుకే ఇప్పుడు నివేదాతో అంత వీజీ కాదండోయ్. ఇకపోతే, అమ్మడికి బైకు రేసింగులూ, ఫార్ములా వన్ రేసింగులూ ఇష్టమేనట. విజయ్ ఆంటోనీతో ఓ సినిమా కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని సొంతంగా డ్రైవ్ చేసి, చిత్ర యూనిట్‌ని ఆశ్చర్యానికి గురి చేసిందీ ముద్దుగుమ్మ.
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..
నివేద పుట్టింది మధురైలో. కానీ, దుబాయ్‌లో సెటిలైంది వీళ్ల ఫ్యామిలీ. నాన్న పేతురాజ్ దుబాయ్‌లో ఉద్యోగం చేసేవాడు. ఆ కారణంగా అక్కడే సెటిలైపోయింది. అక్కడున్నప్పుడే, మోడలింగ్ రంగంలో ఆసక్తి చూపించింది. 2015లో జరిగిన ‘మిస్ ఇండియా యూఏఈ’ పోటీల్లో విన్నర్‌గా నిలిచింది అందాల భామ నివేదా పేతురాజ్.
Also Read: రేసింగ్ క్వీన్ నివేదా: అందం, అభినయం, డైనమిజం.!
ఇక సీక్రెట్ టాలెంట్స్ విషయానికి వస్తే, అప్పుడప్పుడూ పెయింటింగ్స్ కూడా వేస్తుందట ఈ భామ. అలాగే, డాన్సులు డాన్స్ చేయడం తన హాబీగా చెబుతోంది. దేన్నియినా సవాల్‌గా తీసుకుని, సరికొత్త విషయాల్ని నేర్చుకోవడం ఆమెకు ఇష్టమట.
అందుకే Nivetha Pethuraj ఓ ఫైటర్..
‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమై, ఆ తర్వాత తెలుగుతో పాటు, తమిళంలోనూ పలు సినిమాలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్.. కేవలం నటి మాత్రమే కాదు. అంతకు మించి.
తానొక ఇండిపెండెంట్ విమెన్ అనిపించుకునేందుకు.. తనను తాను ఎప్పటికప్పుడు మానసికంగా మరింత ధృఢంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. చాలామందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj).
Also Read: What The Uff.. Nivetha Pethuraj Sizzles In Style!