Table of Contents
NTR ANR Tollywood Legends మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు.. అలగా జనం.. పుడితే నాలా సింహంలా పుట్టాలి.! కనిపిస్తే కడుపు చేసెయ్యాలి.! ఇవన్నీ నందమూరి బాలకృష్ణ డైలాగులే.
కొన్ని సినీ వేదికలపైనా, కొన్ని సినిమాల్లోనూ చెప్పిన డైలాగులు.! ఏటీ పైత్యం.? ఏంటీ వైపరీత్యం.! నో డౌట్, నందమూరి బాలకృష్ణ ప్రముఖ సినీ నటుడు.
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నలుగురు అగ్ర కథానాయకులు.. అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు.
ఆ మహానుభావుడి కడుపున పుట్టి..
స్వర్గీయ నందమూరి తారక రామారావుని కొందరు దేవుడిగా పూజిస్తారు.
కేవలం సినీ నటుడిగానే కాదు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా.. ఆయన సాధించుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అయితే, తన తండ్రి గొప్పతనాన్ని బాలయ్య చెప్పుకోవడం తప్పు కాదు. కానీ, ‘స్వకుచ మర్ధనం’ అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
‘ఆ రంగారావు.. ఈ తొక్కినేని..’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. ఎస్వీ రంగారావు లాంటి మహనీయుడ్ని అగౌరవ పర్చడమేంటి.? అంటూ ‘కాపునాడు’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అక్కినేని అభిమానులైతే, బాలకృష్ణ దిష్టిబొమ్మల్నీ తగలబెట్టేశారు. ఎంత ఎదిగినా ఒదిగి వుండాలి. కానీ, బాలయ్యలో అణువణువునా అహంకారమే కనిపిస్తుంది.
వారసులంటే..
అక్కినేని వాసరులు నాగచైతన్య, అఖిల్ స్పందించారు. ‘ఎస్వీయార్, ఎన్టీయార్, ఏఎన్నార్.. గొప్ప వ్యక్తులు.. వారిని అవమానించడమంటే, మనల్ని మనం కించపర్చుకున్నట్లే’ అన్నారు.

ఎస్వీయార్ (ఎస్ వి రంగారావు) వారసుల స్పందన కొంత అనూహ్యంగా వుంది. బాలయ్య తప్పేమీ లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. కానీ, ఎస్వీయార్ అభిమానులు బాలయ్య వ్యాఖ్యలతో తీవ్ర ఆవేదన చెందారు.
NTR ANR Tollywood Legends.. రెండు కళ్ళు.. పిచ్చోళ్ళు..
కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి జయప్రద, అక్కినేని నాగేశ్వరరావు ముందు ఓ ప్రశ్న వుంచారు. ‘మీరూ, ఎన్టీయారూ.. తెలుగు సినీ పరిశ్రమకి రెండు కళ్ళు కదా..’ అని.
దానికి ఏఎన్నార్ సమాధానమేంటో తెలుసా.? ‘అలా నమ్మడానికి, ఉప్పొంగిపోవడానికీ ఎన్టీయార్ ఏమీ పిచ్చోడు కాదు.. నేనూ పిచ్చోడ్ని కాను.. ఇవన్నీ పత్రికలోళ్ళు రాసుకునే పిచ్చి రాతలు, పిచ్చి పోలికలు.. పిచ్చి పొగడ్తలు’ అనేవారు అక్కినేని నాగేశ్వరరావు.

ఇదే నిజం.! ఇదే వాస్తవం.! తెలుగు సినిమా అంటే.. ఎందరో మహానుభావులు కనిపిస్తారు.
ఎస్వీ రంగారావు, ఎన్టీయార్, అక్కినేని, జగ్గయ్య, భానుమతి, సూర్యకాంతం, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో తరాలు.. ఎన్నెన్నో ధృవతారలు.!
ఇందులో ఎవర్ని తగ్గించి మాట్లాడినా, ఆయా వ్యక్తుల స్థాయే తగ్గిపోతుంది. అంతే తప్ప, ఆ మహానుభావుల స్థాయిని ఎవరూ తగ్గించలేరు.!
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
చివరగా.. తెలుగు సినిమా గురించి ఈ రోజు ప్రపంచం మాట్లాడుకుంటోందంటే.. రాజమౌళి, చరణ్, ఎన్టీయార్.. ఆ స్థాయి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు మరి.!
‘అలగాజనం’.. ఎవరూ వుండరు.! అలగాతనం వ్యక్తుల్లో.. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వంలో వుంటుంది.! బ్లడ్డుకీ, బ్రీడుకీ ‘అలగాతనం’ అంటించుకోవడం మానుకుంటే మంచిది ఎవరైనా.!