Table of Contents
అప్పటిదాకా బక్క పలచగా వున్న ఓ అబ్బాయి కావొచ్చు, అమ్మాయి కావొచ్చు.. అనూహ్యంగా బరువు పెరగడం మొదలవుతుంది. అనూహ్యంగా దాన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లోకి (Obesity Causes Mental Health Problems) వెళ్ళిపోతుంటారు కొందరు.
ఏ వయసులో అయినాసరే, ఈ ‘అతి బరువు’ సమస్య బారిన పడేందుకు ఆస్కారం వుంది. చిన్నా పెద్దా తేడాల్లవు. ఆడ, మగ అన్న తేడాలు అసలే లేవు. ఎక్కువగా తినేయడం ఒక్కటే అతి బరువు సమస్యకు కారణమనే అపోహ చాలామందిలో వుంది.
కానీ, బరువు పెరగడం వెనుక మానసిక సమస్యలు కూడా వుండొచ్చని అంటుంటారు మానసిక వైద్య నిపుణులు. మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, ఎక్కువగా ఇతరులతో కలిసేందుకు ఇష్టపడరు.
ఈ క్రమంలో తమకు తెలియకుండానే ఎక్కువగా తినడం, బయటకు రాకుండా తమను తామే ఓ ‘సర్కిల్’లో బంధించేసుకోవడం, తద్వారా బరువు పెరిగిపోవడం అనేది జరుగుతుంటుంది.

అతి బరువు.. బొద్దుగుమ్మ నమిత ఆవేదన ఇదీ..
‘నేను కూడా అంతే. మానసిక సమస్యలు నన్ను వెంటాడాయి. ఆత్మహత్య చేసుకోవాలనేంతగా మానసిక కుంగుబాటుకి (Obesity Causes Mental Health Problems) గురయ్యాను. దానికి తోడు థైరాయిడ్, పీసీవోడీ సమస్యలు వెంటాడాయి. వెరసి, నేను అనుకోకుండా బరువు పెరిగిపోయాను. పెరిగిన బరువుని తగ్గించుకునే క్రమంలో మళ్ళీ అనారోగ్య సమస్యలు వెంటాడాయి. దాంతో, తొలుత మానసికంగా ధృఢత్వం సంపాదించుకునేందుకు ప్రయత్నించాల్సి వచ్చింది. చాలామంది నేను మద్యం సేవించడం వల్లే లావెక్కానని అనుకున్నారు. కానీ, అది నిజం కాదు’ అని నటి నమిత ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
ఏం తినాలో, ఎలా తినాలో తెలుసుకోవడం తప్పనిసరి..
బరువు తగ్గడం అనేది కూడా ఓ కళ అంటారు.. డైటీషియన్స్. ఏం తినాలి.? ఎంత తినాలి.? అన్న విషయాలపై చక్కటి అవగాహన కలిగి వుంటే, బరువు తగ్గొచ్చన్నది డైటీషియన్ల మాట.
తగిన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, అవసరమైన సమయం నిద్ర పోవడం.. మెలకువగా వున్నంతసేపూ యాక్టివ్‌గా వుండడం చేస్తే, తక్కువ సమయంలోనే బరువు తగ్గించుకోవచ్చన్నది వైద్య నిపుణులు చెప్పే మాట.
బరువు తగ్గించుకోవడం కోసం రాత్రి పూట భోజనం మానెయ్యడం, ఉదయం పూట అల్పాహారం మానెయ్యడం, మధ్యాహ్నం కూడా సరిగ్గా తినకపోవడం చేస్తే, లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది గనుక, వైద్య సలహా తీసుకుని మాత్రమే, డైట్ ప్లాన్ చేసుకోవాల్సి వుంటుంది.

కుంగిపోతే కోలుకోవడం కష్టం.. Obesity Causes Mental Health Problems
పెరిగిన బరువుని చూసి కుంగిపోయి, రాత్రికి రాత్రి బరువు తగ్గిపోవాలనుకుంటే కుదరదు. బరువు తగ్గడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుని, తగినంత సమయం తీసుకుని, ఆ సమయంలో చెయ్యాల్సినవన్నీ చేయాల్సి వుంటుంది. అప్పుడే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి వీలవుతుంది.
పిల్లలకీ, పెద్దలకీ, మహిళలకీ, పురుషులకీ.. ఒకటే సూత్రం. వైద్య సలహా తప్పనిసరి. మార్కెట్‌లో బరువు తగ్గించేందుకోసం అందుబాటులో వుండే పరికరాలు, మందులు.. ఇలా దేన్ని ఉపయోగించాలన్నాసరే, సరైన డాక్టర్‌ని (Obesity Causes Mental Health Problems) సంప్రదించాల్సిందే.