Pathaan Movie.. ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.! వెండితెరపై బూతు సన్నివేశాలు కొత్తేమీ కాదు. కాకపోతే, రాజకీయ వివాదం.. ‘పఠాన్’ సినిమా కొంప ముంచేసింది.
కామెడీ ఏంటంటే, సినిమాలో హీరోయిన్ దీపికా పడుకొనే ధరించిన బికినీ రంగు మీద కూడా రాజకీయ వివాదం చెలరేగడం.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఔను, అలాగే వుంది పరిస్థితి. ఇక్కడ షారుక్ – దీపికల మధ్య ‘జుగుప్సాకరమైన’ రొమాన్స్ కూడా ఆక్షేపణీయమే.
ఇకపై అన్నిటికీ అదే కత్తెర పదును.?
ప్రతిసారీ ఇదే చర్చ.. కాదు కాదు రచ్చ.! అప్పుడెప్పుడో ‘పద్మావత్’ సినిమా విషయమై రగడ చెలరేగితే, సెన్సార్ ఇబ్బందులొచ్చాయ్.. ‘కవరింగ్’ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు ‘పఠాన్’ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. జుగుప్సాకరమైన రీతిలో వున్న కంటెంట్‌కి కత్తెర పడింది.

కట్స్ గట్టిగానే వేసి, సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. సో, ‘పఠాన్’ విడుదలకు లైన్ పూర్తిగా క్లియర్ అయ్యిందన్నమాట.
Pathaan Movie.. జస్ట్.. ఇదొక సినిమా మాత్రమే..
సినిమాలో నటీనటులు ఎలాంటి దుస్తులు ధరిస్తేనేం.? సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం వరకే.. ఇలా చెయ్యాలి.. అలా చెయ్యాలని ఆదేశించడానికి వీల్లేదంటారు కొందరు.
ఓ పార్టీ రంగుని పోలిన బికినీలో దీపికా పడుకొనే కనిపించడమే వివాదానికి కారణమట. ఎంత ఛండాలంగా వుందో కదా ఈ పోలిక.?
Also Read: ‘వీర సింహా రెడ్డి’ని తొక్కిపడేసిన ‘వాల్తేరు వీరయ్య’.!
తప్పలేదు.. కత్తెర వేటుకి ‘పఠాన్’ ఒప్పుకుంది. ఇక, సినిమాలో దీపిక – షారుక్ ‘ముదురు రొమాన్స్’ తాలూకు అరాచకమేంటో వెండితెరపై చూసెయ్యాల్సిందేనేమో.!
అయినా, చాలా కోసేశారంటున్నారుగా.. చూడటానికేముంటుందక్కడ.? సినిమా అంటేనే అదొక్కటేనా.? యాక్షన్ గట్రా వుంటాయ్ కదా.?