Pawan Kalyan Battery Cycle.. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి, కళాశాలకు వెళ్ళేందుకోసం, ఓ బ్యాటరీ సైకిల్‌ని స్వయంగా తయారు చేసుకున్నాడు.
ఆ కుర్రాడి పేరు రాజాపు సిద్దూ. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేసుకున్న సిద్దూ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిశాడు.
రాజాపు సిద్దూ స్వస్థలం విజయనగరం. సిద్దూ తయారు చేసిన బ్యాటరీ సైకిల్‌కి మూడు గంటలు ఛార్జింగ్ చేస్తే, 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సత్తా వుంది.
Pawan Kalyan Battery Cycle.. లక్ష రూపాయల ప్రోత్సాహకం..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే, సిద్దూ ఆవిష్కణలను చూసి అచ్చెరువొందారు పవన్ కళ్యాణ్.
సిద్దూ ఆవిష్కరణల్ని మెచ్చి, ప్రోత్సాహకంగా లక్ష రూపాయల సాయాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

అంతే కాదు, సిద్దూని వెనకాల కూర్చోబెట్టుకుని బ్యాటరీ సైకిల్‌ని పవన్ కళ్యాణ్ నడపడంతో, సిద్దూ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
సిద్దూని పవన్ కళ్యాణ్ అభినందించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, బ్యాటరీ సైకిల్‌ని నడిపిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సాయం చేయడం పవన్ కళ్యాణ్‌కి కొత్తేమీ కాదు. కాకపోతే, ఇది ఇంకాస్త ప్రత్యేకం. కొత్త ఆవిష్కరణలు చేసే యువతకి, పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందుతుందో చాటి చెప్పే ఘటన ఇది.