Table of Contents
Pawan Kalyan Bro Rajakeeyam.. ‘బ్రో’ అనేది జస్ట్ సినిమా మాత్రమే కాదు.! అవునా.? సినిమా కాదా.? మరేంటి.?
జస్ట్ సినిమా మాత్రమే అయితే.. సినిమా వసూళ్ళపై మంత్రి ఎందుకు స్పందిస్తారు.? నిజమే కదా.!
మంత్రి.. అంటే ఏంటి.? ప్రజాధనం ఆయనకు గౌరవ వేతనంగా ఇవ్వబడుతుంది.
గౌరవ వేతనం కోణంలో కాకపోయినా, ప్రజా ప్రతినిథి గనుక.. రోజులో ఇరవై నాలుగ్గంటలూ ప్రజా సేవ కోసమే పని చెయ్యాలి.! ఇంకా నయ్యం.. ఆ సోయ లేదాయె.!
వెర్రి వెంగళప్పలు..
వెర్రి వెంగళప్పల్లా మీడియా ప్రతినిథులు, ప్రెస్ మీట్‌కి అటెండ్ అయితే.. మంత్రిగారేమో.. సినిమా వసూళ్ళ గురించిన వ్యాఖ్యలు చేశారక్కడ.
‘మీరేమో మంత్రిగారు కదా.. మీరేంటి సినిమా వసూళ్ళ గురించీ, సినిమా టాక్ గురించీ మాట్లాడుతున్నారు.?’ అని ఒక్క మీడియా ప్రతినిథీ నిలదీయలేకపోయారు సదరు మంత్రిని.

మీడియా ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ఆశ్చర్యకరం. రాజకీయ నాయకులు సినిమా లెక్కల్ని మాట్లాడటం అనేది ‘లేకితనం’.!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు, ఇంకో వైపు సినిమాలు చేస్తున్నారంటే.. దానికి రెండు కారణాలున్నాయి.
Pawan Kalyan Bro Rajakeeyam.. సమాజం పట్ల బాధ్యత..
ఒకటి సమాజం పట్ల బాధ్యత.. ఇంకోటి సినిమాపైన ఇష్టం.! అదే సమయంలో, పార్టీ కోసం అవసరమైన నిధుల్ని సినిమాల ద్వారానే నిజాయితీగా పవన్ కళ్యాణ్ సంపాదిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాలు ఫ్లాపయినా, హిట్టయినా.. ఆయన రెమ్యునరేషన్‌లో కోత వుండదు.
గెలిపించిన ప్రజలకు ఏం చేయాలన్న సోయ లేకుండా.. ఓడినోడి సినిమాలకి రివ్యూలు చెప్పుకునే స్థాయికి దిగజారిపోయిన ఈ రాజకీయాన్ని ఏమనాలి.?
Mudra369
ఇంకో ముఖ్యమైన విషయం.. పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తే, తమకొచ్చే లాభాల్ని పరిగణనలోకి తీసుకునే.. ఆయా ప్రాజెక్టుల్ని సెట్ చేస్తుంటారు నిర్మాతలు.
ఇవన్నీ తెలిసీ, మీడియా ముందుకొచ్చి.. ప్రజా ప్రతినిథులు.. అందునా మంత్రులు చవకబారు విమర్శలు చేస్తున్నారంటే ఏమనాలి.?
అలా దిగజారిపోతున్నారు..
సినిమాలకు రివ్యూలు చెప్పుకునే స్థాయికి.. సినిమాల వసూళ్ళను చెప్పుకునే స్థాయికి మంత్రులు దిగజారిపోవడం అత్యంత హాస్యాస్పదం.!

ఒక్కటి మాత్రం నిజం.. పవన్ కళ్యాణ్ (Jana Sena Party Pawan Kalyan), మంత్రుల్ని రోడ్డుకి లాగేశారు.! అదీ తన సినిమాలతో.!
కానీ, ఆ విషయం.. పదవులు కోల్పోయిన మంత్రులకే అర్థం కాలేదు. అలా పదవులు పోగొట్టుకున్నవాళ్ళని ప్రత్యక్షంగా చూసినోళ్ళకీ అర్థం కావట్లేదు.!
Pawan Kalyan Bro Rajakeeyam.. నడి రోడ్డు మీద గుడ్డలూడదీసి..
ఛీ.. ఛీ.. మా సమస్యల గురించి మాట్లాడటానికి గొంతు పెగలదుగానీ, మంత్రులు సినిమాల వసూళ్ళపై మాట్లాడతారా.? అని జనం ఛీత్కరించుకుంటున్నారు.
దురదృష్టం.. మంత్రులకి అది కూడా అర్థం కావట్లేదు.!
Also Read: న్యూసూ న్యూసెన్సూ! ఎనకటి రెడ్డిగాడి పెళ్ళాం లేచిపోయిందట!
ఔను, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాల్సిందే. బాధ్యతగల పదవుల్లో వున్న వ్యక్తులు ఎంత నీఛ స్థాయికి దిగి వ్యవహరిస్తున్నారో.. జనానికి అర్థమయ్యేలా చెయ్యాలి. అదే పవన్ కళ్యాణ్ చేస్తున్నది.
దిక్కుమాలిన రాజకీయాన్ని నడి రోడ్డు మీద గుడ్డలూడదీసి నిలబెడుతున్న పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan)కి హేట్సాఫ్ చెప్పాల్సిందే.