Table of Contents
Pawan Kalyan Deeksha.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరుతో కొందరు యువకులు మాల ధారణ చేస్తున్నారు. సుమారు 40 రోజులకు పైగా దీక్ష చేస్తారట.
ఈ క్రమంలో భుజాన ఎర్ర తువాలుని వేసుకుంటారట. దీక్ష అంటే, భజనలు.. కీర్తనలు అని కాదు.! దైవ భక్తి అని కూడా కాదు.! ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరుతో మాల ధారణ, దీక్ష వ్యవహారాలు వేరు.
తమ అభిమాన నటుడు, నాయకుడికి సంబంధించిన భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్ళడం ఈ ‘పవన్ మాల ధారణ – దీక్ష’ తాలూకు ముఖ్య ఉద్దేశ్యం.!
అయితే తప్పేంటి.?
రాజకీయ నాయకులకూ అభిమానులుంటారు. కాదు కాదు, అనుచరులు, కార్యకర్తలుంటారు. తమ అభిమాన నాయకుల్ని దేవుళ్ళుగా పూజిస్తుంటారు.

అయినా, రాజకీయాల్లో పాలాభిషేకాలు కొత్తేమీ కాదు. పూజలూ కొత్తేమీ కాదు. అవినీతి, అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులకు పాలాభిషేకాలు చేసే భక్తులుంటే తప్పు కాదట.!
కానీ, పవన్ కళ్యాణ్ లాంటి పాపులారిటీ వున్న నటుడు, నాయకుడికి భక్తుల్లాంటి అభిమానులుండకూడదట. అది ‘సైకోఫ్యానిజం’ అంటున్నారు కొందరు.
Pawan Kalyan Deeksha దోచుకున్నాడా.? జైలుకెళ్ళాడా.?
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నేరాలకూ పాల్పడలేదు. నేరాలకు పాల్పడినట్లు ఆయనపైన అభియోగాలు కాదు కదా, కనీసం ఆరోపణలు కూడా లేవు.
పైగా, సినీ నటుడిగా తాను సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని సమాజం కోసం ఖర్చు చేస్తున్నాడు. అలాంటప్పుడు, పవన్ కళ్యాణ్‌కి భక్తులుంటే తప్పేంటి.?
సమాజానికి సేవ చేయండి.. రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నించండి.. అనే భావ జాలాన్ని పవన్ కళ్యాణ్ తరఫున ఆయన అభిమానులు ‘మాల ధారణ, దీక్ష’ ద్వారా ప్రచారం చేస్తే, ఎందుకు నొప్పి.?
తప్పుడు మనుషుల మేతావితనం.!
బహుశా సోకాల్డ్ రాజకీయ నాయకుల్లా పవన్ కళ్యాణ్, జనాన్ని మోసం చేసి వుండాలేమో.! మోసగాడిగా ముద్ర పడితేనే, రాజకీయ దేవుడిగా కొలిచి క్షీరాభిషేకాలు చెయ్యాలేమో.!
Also Read: తెలుగు సినిమాని ‘పాడె’ మీదకు ఎక్కిస్తున్నదెవరు.?
ఇదిగో, ఇలా తయారైంది వ్యవహారం. రాజకీయానికి అర్థం మార్చేసిన సోకాల్డ్ రాజకీయ నాయకులు, వారి వల్ల ‘సైకోల్లా’ తయారైన కొందరు మేతావుల వల్లనే ఈ దుస్థితి.
దేన్ని విమర్శించాలో, దేన్ని అభినందించాలో తెలియని స్థాయికి దిగజారిపోయింది ఆ మేతావితనం.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?