Home » కష్టార్జితం ప్రజల కోసం.! జన సేవకై జనసేనాని.!

కష్టార్జితం ప్రజల కోసం.! జన సేవకై జనసేనాని.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Donation School.. అదేంటీ, చిన్న పిల్లలు తినే ‘చిక్కీ’ ప్యాకెట్ల మీద కూడా అధికారంలో వున్నోళ్ళ ఫొటోలు వేసుకోవాలి కదా.? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసెయ్యాలి కదా.?

ఈయనేంటీ, స్వార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెడతానంటారు.? పసి పిల్లలు అడిగితే మాత్రం, స్కూలు ఆట స్థలం కోసం, కష్టార్జితం 60 లక్షలు వెచ్చించేస్తే ఎలా.?

తప్పు చేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ గారూ.! అధికారంలో వుంటే, అడ్డంగా దోచుకోవాలిగానీ, ప్రజల బాగోగులు చూసుకోకూడదు.!

Pawan Kalyan Donation School.. సాయం చెయ్యాలంటే.. మనసు మంచిదై వుండాలి..

మొన్నేమో, వరదలకి ప్రజలు బాధపడుతున్నారంటూ కష్టార్జితం ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు.. ఇప్పుడేమో, స్కూలు ఆట స్థలం కోసం 60 లక్షలు వెచ్చించడం.. ఏంటిదంతా.?

పవన్ కళ్యాణ్ అంటే, ఫక్తు రాజకీయ నాయకుడు కాదు.! రాజకీయం అంటే దోచుకోవడం కాదు, సేవ చేయడమని బలంగా నమ్మే నిఖార్సయిన నాయకుడు పవన్ కళ్యాణ్.

అసలు విషయంలోకి వస్తే..

‘బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు.

Pawan Kalyan
Pawan Kalyan

మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సందర్భంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదన్న విషయాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాను. ఇచ్చిన మాట మేరకు నా సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చినట్టు’ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియచేశారు.

మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు.

బుధవారం రాత్రి మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు.

పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి రూ. 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన సందర్భంగా మైసూరవారిపల్లి గ్రామ సభలో స్వయంగా పాల్గొనడం జరిగింది. ఈ సభలో ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం లేదు అని విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకువచ్చారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఆట స్థలానికి భూమి కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీ పరిధిలో ఎంతో కొంత ప్రభుత్వ భూమి ఉంటుంది కదా కేటాయించవచ్చు అనుకుంటే మైసూరవారిపల్లికి సెంటు ప్రభుత్వ భూమి కూడా లేదు అని తెలిసింది. ప్రతి ఒక్కరు మన పిల్లలు దృఢంగా తయారు కావాలి. చదువుకోవాలి. మానసికంగా ఎదగాలి అని కోరుకుంటాము.

పాఠశాలల్లో పరిస్థితులు చూస్తే అగ్గిపెట్టె ల్లాంటి గదుల్లో పెట్టేస్తాం. ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా లేక పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను రాజకీయాల్లోకి రాక ముందే ప్రజలకు ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో ఎన్జీవోగా ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ పేరిట ఓ ట్రస్టు మొదలు పెట్టాను. అవసరం ఉన్న చోట చదువుకునే విద్యార్ధులకు సాయం చేయడం, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం దాని ఉద్దేశం.

ఎంతో మంది చదువులకు సాయం చేసినా బయటకి చెప్పుకోవడం అలవాటు లేదు. అయితే మైసూరవారిపల్లి పాఠశాల కోసం స్థలం అడిగితే ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రాథమిక వైద్య శాల కోసం మాత్రం శ్రీ కారుమంచి నారాయణ గారు స్థలం ఇస్తానన్నారు.

Also Read: ప్రకాష్ రాజ్.! అసలు నువ్వు ఎవడివి.?

ఆట స్థలం కోసం రూ. 20 లక్షలు సొంత ట్రస్ట్ నుంచి ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. మిగిలిన మొత్తం దాతల సహకారం తీసుకోమని చెప్పాను. దసరా లోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని గ్రామ సభలో మాటిచ్చాము. రెండు రోజుల క్రితం కార్యాలయం అధికారులు ఆట స్థలం వ్యవహారంలో ముందుకు వెళ్లలేకపోతున్న విషయాన్ని తెలియపరిచారు.

చివరికి రూ. 60 లక్షలు సొంత ట్రస్టు నుంచే ఇచ్చేయాలని నిర్ణయించాము. ఆట స్థలం కోసం శ్రీమతి పగడాల పద్మావతి గారి భూమిని గుర్తించాము. ఆమె కూడా పిల్లల కోసం విక్రయించేందుకు ముందుకు రావడంతో కొనుగోలు చేసి పిల్లల కోసం ఆట స్థలం సమకూర్చాము” అన్నారు.

స్థల విక్రేతలకు సత్కారం.. విద్యార్ధులకు క్రీడా పరికరాలు

మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం కోసం భూమి విక్రయించిన శ్రీమతి పగడాల పద్మావతి గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా సత్కరించారు. పాఠశాల విద్యార్ధులకు క్రికెట్ కిట్లు, వాలీ బాల్, ఫుట్ బాల్, చెస్ బోర్డు తదితర క్రీడా పరికరాలు రెండు సెట్లు బహూకరించారు. విద్యార్ధులు, స్థల విక్రేతలతోపాటు ఆట స్థలం ఏర్పాటుకు సహకరించిన పార్టీ నాయకులు, అధికారులను అభినందించారు.

ఇదండీ సంగతి.! అర్థమయ్యింది కదా.! పవన్ కళ్యాణ్ వేరు, ఇతర రాజకీయ నాయకులు వేరు.! ఆయనకు తెలిసింది సాయం మాత్రమే.! ఆ గొప్ప మనసుకి అధికారమిస్తే.. ఇలా వుంటుంది.! పూర్తి అధికారమిస్తే.. మరిన్ని అద్భుతాలు జరుగుతాయ్.!

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group