Table of Contents
Pawan Kalyan HHVM Suprise.. నిజానికి, చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు.. సినీ‘మాయ’ నుంచి బయటకు వచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని పక్కన పెట్టి, జనసేనాని పవన్ కళ్యాణ్ అనే మూడ్‌లోకి వచ్చేశారు.!
పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలున్నాయ్.. వాటిల్లో ‘హరి హర వీర మల్లు’ మొదటిది కాగా, రెండోది ‘ఓజీ’, మూడోది ‘ఉస్తాద్ భగత్ సింగ్’.! ఇంకో నాలుగైదు సినిమాలు పట్టాలెక్కాల్సి వుంది.
Pawan Kalyan HHVM Suprise.. అడ్డంకిగా రాజకీయ ప్రయాణం.!
వాస్తవానికి, ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈపాటికే విడుదలైపోయి వుండాలి. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తానం, ఈ సినిమాలకు అడ్డంకిగా మారింది.
నిర్మాతలూ అన్నీ తెలుసుకునే, రంగంలోకి దిగారు. సో, వివాదం లేదు.! దర్శకులూ అన్నిటికీ సిద్ధపడే, పవన్ కళ్యాణ్‌తో సినిమాల కోసం ముందుకొచ్చారు.
హరీష్ శంకర్, వేరే సినిమాల పనుల్లో పడ్డాడు. క్రిష్ కూడా అదే బాటలో ప్రయత్నిస్తున్నాడు. సుజీత్ కూడా రేపో మాపో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయొచ్చు.
పిచ్చి ప్రచారాలకు ఫుల్ స్టాప్.!
ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ నుంచి ఇక సినిమాలు రావనీ, మొదలైనవి కూడా ఆగిపోతాయనీ.. రకరకాల ప్రచారాలు తెరపైకొస్తున్నాయి.
తీసుకున్న అడ్వాన్స్ రెమ్యునరేషన్లని తిరిగిచ్చేస్తాడనీ, నష్టాల్ని కూడా భరిస్తాడనీ.. ఏవేవో రాతలు కొన్ని గాసిప్ వెబ్ సైట్స్‌లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్.! ఖాయమైనట్టేనా.?
కానీ, ‘ఓజీ’ రిలీజ్ డేట్‌ని ఇటీవల ఆ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించేసింది. తాజాగా, ‘హరి హర వీర మల్లు’ టీమ్, సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్ వదిలింది.
నిజంగానే, ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా చాలా షాకింగ్ సర్‌ప్రైజ్. పొలిటికల్ మూడ్‌లో వున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, సినిమా మూడ్‌లోకి రాలేకపోతున్నారు.
అటు రాజకీయం.. ఇటు సినిమా..
సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమం. అభిమానులు ఒకింత హుషారుగా మారడానికి, పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్స్ ఊతమిస్తాయన్నది నిర్వివాదాంశం.
‘హరి హర వీరమల్లు’ అప్‌డేట్ ఏంటంటే, సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయనీ, త్వరలో ప్రోమో విడుదల చేయబోతున్నారనీ.!
పవన్ కళ్యాణ్ అభిమానులకి ఈ అప్డేట్ స్వీట్ షాక్ ఇస్తే, గాసిప్స్ వెబ్ సైట్స్‌కి మాత్రం గూబ గుయ్యిమనిపించేలా షాకింగ్ న్యూస్ అయ్యిందిది.!