Table of Contents
Pawan Kalyan Jagan Opposition.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దయాదాక్షిణ్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భవితవ్యం ఆధారపడి వుంటుందని ఎవరైనా ఊహించారా.?
ప్చ్.! ఛాన్సే లేదు.! అదఃపాతాళానికి తొక్కేస్తాం.. నెత్తి మీద కాలు వేసి మరీ పాతాళానికి తొక్కేస్తాం.! అంటూ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీని హెచ్చరించారు.
హెచ్చరించినట్లే, వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయేలా పాతాళానికి పవన్ కళ్యాణ్ తొక్కేశారు ఇటీవలి ఎన్నికల్లో.
లేకపోతే, వ్యక్తిత్వ హననం.. మరీ అంత దారుణంగానా.? ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ప్రతిసారీ, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన అధికారిక బహిరంగ సభల్లో చేయడమా.?
Pawan Kalyan Jagan Opposition.. ప్రతిపక్ష హోదా దక్కేదెలా.?
అసలు విషయంలోకి వస్తే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు.
ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం సీట్లు.. అంటే, 18 సీట్లు వైసీపీకి వుండాలి. కానీ, వైసీపీకి ఇటీవలి ఎన్నికల్లో వచ్చిన సీట్ల సంఖ్య 11 మాత్రమే.

దాంతో, అధికారంలో వున్న ఎన్డీయే కూటమి దయాదాక్షిణ్యాల కోసం దేబిరించాల్సిన దుస్థితి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చింది.
మూడో స్థానంలో వైసీపీ..
దాంతో, ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. అయితే, అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం చూసుకుంటే మొదటి స్థానంలో టీడీపీ వుంది. రెండో స్థానం జనసేన పార్టీది. మూడో స్థానం వైసీపీది. నాలుగో స్థానం బీజేపీది.
టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డ దరిమిలా, ఈ మూడూ అధికారంలో వున్నాయి. విపక్షంగా వైసీపీ వుంది. ఆ విపక్షానికి ప్రతిపక్ష హోదా దక్కాలంటే, దయా దాక్షిణ్యాలు చూపాల్సింది జనసేన పార్టీనే.
ఎందుకంటే, సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే, ప్రతిపక్ష హోదా జనసేన పార్టీకి దక్కాల్సి వుంది. ప్రభుత్వంలో కొనసాగుతూ, ప్రతిపక్షంగా వుండటమెలా.? అన్నదానిపై సాంకేతిక కోణాల్ని పరిశీలిస్తున్నాం.. అని జనసేనాని గతంలోనే ప్రకటించారు.
జగన్ గనుక పవన్‌ని బతిమాలుకుంటే..
సో, ఇక్కడ పద్ధతి ప్రకారం లేఖని స్పీకర్‌కి వైఎస్ జగన్ రాశారుగానీ, జనసేన పార్టీని వైఎస్ జగన్ ‘ప్రతిపక్ష హోదా కావాలి’ అని ‘అడుక్కుంటే’, ఏమన్నా ఫలితం వుంటుందేమో.!
Also Read: వైసీపీ ఓటమి.! వైఎస్ జగన్ స్వయంకృతాపరాధమే.!
నెత్తి మీద కాలు వేసి అదఃపాతాళానికి తొక్కేయడమంటే ఇదే మరి.! ఇంతకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘ప్రతిపక్ష హోదా’ విషయమై జగన్‌ని కనికరిస్తారా.?
కనికరించాలంటే, తొలుత పవన్ కళ్యాణ్‌ని వైఎస్ జగన్ బతిమాలుకోవాలి కదా.? ఆ రోజెంతో దూరంలో లేదు.!