ఎడ్డితనమే అనుకుంటే, దానికి లేకితనం కూడా తోడయ్యింది.! పది మందికి తిండి పెట్టేవాడు (Pawan Kalyan) అసమర్థుడెలా అవుతాడు.?
ఆమాత్రం ఇంగితం వుంటే ఎడ్డితనమని ఎందుకు అంటాం.? లేకితనమని ఎందుకు అనగలుగుతాం.?
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. లక్షలాది రూపాయల్ని, కోట్లాది రూపాయల్ని.. అది కూడా కష్టార్జితాన్ని.. ‘సాయం’ కోసం వినియోగిస్తున్నారు.
సాయం నేరం.! ఇదే కలికాలం.!
సినిమా నటుడన్న విషయాన్ని పక్కన పెడదాం. రాజకీయ నాయకుడన్న విషయాన్నీ కాస్సేపు మర్చిపోదాం. సాటి మనిషి కష్టాల్లో వున్నాడని తెలిసి, ఆదుకునేవాడిని ఏమనాలి.? దేవుడనే అనాలి.!

అలా చూస్తే, పవన్ కళ్యాణ్ అంటే దేవుడే.! ఔను, సాయం పొందినవారికి ఆయన దేవుడే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
జనసేనాని.. జనసేన పార్టీ ద్వారా జనంలోకి వెళ్ళారు.. కానీ, ఆ జనంలో చాలామంది ఆయన్ని లైట్ తీసుకున్నారు. కానీ, జనాన్ని పవన్ కళ్యాణ్ లైట్ తీసుకోలేదు.
Pawan Kalyan గెలుపోటముల సంగతి తర్వాత..
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలుస్తారా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, పవన్ కళ్యాణ్ అసమర్థుడెలా అవుతాడు.? పవన్ కళ్యాణ్‌కి లేకితనం ఎలా అంటగడతారు.?
అవినీతి రాజకీయాలు చేసి కోట్లు గడించిన నాయకులు, ప్రజలు ఛస్తోంటే పట్టించుకోరు. వాళ్ళది కదా అసమర్థత.. లేకితనం.!
Also Read: వైరల్.! గుండ్రంగా ఎందుకు తిరుగుతున్నాయ్ గొర్రెల్.?
అసమర్థ, లేకి రాజకీయ నాయకులు.. విసిరే బిస్కెట్లకి కక్కుర్తి పడే గ్రామ సింహాల్లాంటి సోకాల్డ్ పాత్రికేయులు, మీడియా సంస్థల్ని నడుపుతున్న వ్యక్తులది కదా, లేకితనం.. అసమర్థత.?
వాళ్ళు చెప్పిందే నిజం.. వీళ్ళు చూపించేదే వాస్తవం.! ఇదీ అటు రాజకీయం, ఇటు పాత్రికేయం కలిసి ఆడుతున్న నాటకం.!
సాయం పొందినోడికే తెలుస్తుంది.. సాయపడ్డవాడి గొప్పతనం.! ఆయా పార్టీలకు బానిసత్వం చేయడమే రాజకీయం అనుకునేవాళ్ళకి సాయం విలువ తెలిసే అవకాశమే లేదు.
ఫైనల్ టచ్..
కళ్ళుండీ నిజాన్ని చూడలేకపోవడం అసమర్థత.! అవతలి వ్యక్తి చేస్తున్న సాయాన్ని చూసి కుళ్ళుకోవడం లేకితనం.! కుల జాడ్యంతో కొట్టుమిట్టాడే వాళ్ళకే వర్తిస్తాయ్ అసమర్థత, లేకితనం.. వంటివి.