Pawan Kalyan Rajakeeyam జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చాలాకాలమే అయ్యింది. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు జనసేనాని పవన్ కళ్యాణ్.! 2024 ఎన్నికల్లో ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేం.
అసలు జనసేనాని గెలవాలంటే ఏం చెయ్యాలి.? జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బావుంటుంది.!
ఉచిత సలహాలు.!
ఏమీ ఆలోచించకుండానే రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చేశారని అనుకోగలమా.? సినిమా కెరీర్‌ని పణంగా పెట్టి మరీ రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్.
కోట్లాది రూపాయల పారితోషికాన్ని వదులుకొని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారంటే, అదీ ఆయన నిబద్ధత.! ‘మార్పు కోసం’ అంటూ పరితపిస్తున్నారు పవన్ కళ్యాణ్.

అయినా, మార్పు ఎవరిలో రావాలి.? ప్రధాన రాజకీయ పార్టీలు కులాల కుంపట్లను రాజేస్తోంటే, చూస్తూ మౌనంగా వుంటోన్న మేధావి వర్గంలోనా.? కష్టనష్టాల్ని భరిస్తోన్న ప్రజల్లోనా.?
Pawan Kalyan Rajakeeyam ఇలా చేస్తే పోలా.?
కౌలు రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. కుటుంబానికి లక్ష చొప్పున పంచుకుంటూ వెళుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ, చేయాల్సింది అది కాదు.!
ఎన్నికల సమయంలో ఓట్లను కొనేందుకు విచ్చలవిడిగా డబ్బు పంచెయ్యాలి. ఔను, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంతలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. ఎన్నికల వేళ ధన ప్రవాహం ఆగడంలేదు.
అబద్ధాలు చెప్పాలి, డబ్బులు పంచాలి.. కులాల కుంపట్లను రాజేయాలి.. రాజకీయంగా వెన్నుపోట్లు పొడవాలి.. గొడ్డలి వేటుని గుండె పోటుగా చిత్రీకరించాలి.. ఇంకా చాలా చాలా చేయాలి.
ఇదీ నేటి రాజకీయం. ‘సాయం’ చేస్తా, ‘మార్పు’ తెస్తా.? పద్ధతిగా రాజకీయాలు చేస్తా.. అంటే కుదిరే పని కాదు.!
సాయం పొందినోళ్ళు సైతం ‘మిస్టర్ క్లీన్’ జనసేన పార్టీకి ఓటేసే పరిస్థితి వుండదు. ఎందుకంటే, ఓటేసేటప్పుడు, చేతిలో పడే కరెన్సీ నోటు పవర్ అలాంటిది మరి.!
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
అయినాసరే, మార్పు కోసం ప్రయత్నిస్తున్నానంటోన్న పవన్ కళ్యాణ్‌ని స్వాగతిద్దాం.! మంచి రాజకీయాలు రావాలని ఆకాంక్షిద్దాం.!
పవన్ కళ్యాణ్ అనే కాదు, ఎవరైనాసరే… ‘స్వచ్ఛ’ రాజకీయాలు చేస్తామంటే స్వాగతించి తీరాల్సిందే.