Table of Contents
Pawan Kalyan Divorced Again.. జన సేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కి వైవాహిక జీవితం అస్సలేమాత్రం కలిసి రావడంలేదు.!
తొలుత విశాఖపట్నంకి చెందిన నందినితో పవన్ కళ్యాణ్‌కి వివాహమయ్యింది. ఆ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్.
కొన్నేళ్ళ తర్వాత రేణు దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ వివాహమాడారు. పవన్ కళ్యాన్ – రేణు దేశాయ్ ఇద్దరూ పెళ్ళికి ముందు కొన్నేళ్ళపాటు సహజీవనం చేశారు కూడా.
రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ వైవాహిక బంధానికి తీపి గురుతులుగా వీరికి ఆద్య, అకిరానందన్ జన్మించారు. ఆ తర్వాత, రేణు దేశాయ్ నుంచి విడాకులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Divorced Again.. వ్యక్తిగత జీవితం వేరు..
ఇక, రేణు దేశాయ్‌తో విడాకుల తర్వాత, రష్యన్ మహిళ అన్నా లెజినెవాని పెళ్ళాడారు పవన్ కళ్యాణ్. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
తాజాగా, అన్నా లెజినెవాతో విడాకులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ‘పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం..’ అంటూ, ఓ ప్రెస్ నోట విడుదల చేశారు పవన్ కళ్యాణ్, అన్నా లెజినెవా.
సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం వేరు. రాజకీయ నాయకుడిగా, అందునా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం వేరు.
రాజకీయ ప్రత్యర్థులు పదే పదే ‘మూడు పెళ్ళిళ్ళు.. ముగ్గురు పెళ్ళాలు..’ అంటూ పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు చాలా ఏళ్ళుగా చేస్తూనే వున్నారు.
కుదరట్లేదు…
కారణాలేవైనా సరే, అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం. ‘నాకు కుదరలేదు..’ అని పలు సందర్భాల్లో విడాకుల విషయమై వచ్చే విమర్శలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ వచ్చారు.
ఇప్పుడూ అదే ఇంకోసారి ఇంకాస్త బలంగా పవన్ కళ్యాణ్ చెప్పుకోవాల్సి వస్తుందంతే.! వ్యక్తిగత జీవితం వేరు, ప్రజా సేవ వేరు.!
కానీ, రాజకీయాల్లోకి వస్తే, వ్యక్తిగతంగానైనా తిడతాం.. అంటారు రాజకీయ ప్రత్యర్థులు.
భార్యకు విడాకులివ్వకుండానే, సినీ నటి త్రిషతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.
ఆ విజయ్‌కి పూర్తి మద్దతిచ్చే, ఏపీలోని వైసీపీ శ్రేణులు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం ఆశ్చర్యకరమే.
అభిమానుల్లో అయోమయం..
ఆ సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్‌ని ఎలా డిఫఎండ్ చేసుకోవాలో అర్థం కాని అయోమయస్థితిలో వున్నారిప్పుడు.
మొన్నీమధ్యనే పవన్ కళ్యాణ్‌కి సర్జరీ జరిగితే, పవన్ కళ్యాణ్ వెంటే వున్నారు అన్నా లెజినెవా. సోషల్ మీడియాలోనూ కొన్నాళ్ళు యాక్టివ్ అయి, అనూహ్యంగా అకౌంట్ డిలీట్ చేసేశారు.
క్రిస్టియన అయినప్పటికీ, పవన్ కళ్యాణ్‌తో గుళ్ళూ గోపురాలు తిరిగారు అన్నా లెజినెవా. అంతేనా, తిరుమలలో తల నీలాలు కూడా సమర్పించారామె.
ఇంతలోనే ఏమయ్యిందో.. పవన్ కళ్యాణ్, అన్నా లెజినెవా మధ్య వైవాహిక జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో.. ఇద్దరి వైవాహిక జీవితం, విడాకులతో ముగిసింది.
విడిపోయినా, తామిద్దరం స్నేహితుల్లా వుంటామనీ, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల్లా వుంటామని, ఇద్దరూ విడుదల చేసిన కామన్ ప్రెస్ నోట్లో పవన్ కళ్యాణ్, అన్నా లెజినెవా పేర్కొన్నారు.