Pet Dogs Lip Locks.. సినిమాలో లిప్ లాక్ సీన్స్ సర్వసాధారణమైపోయాయి. వెబ్ సిరీస్‌ల పుణ్యమా అని లిప్ లాక్ సీన్స్ అంటేనే వెగటు పుట్టేస్తోంది.
హీరో – హీరోయిన్ మధ్య లిప్ లాక్.. అంటే, అందులో రొమాంటిక్ యాంగిల్ వుండొచ్చుగాక.! ఇద్దరు మగాళ్ళ మధ్య, ఇద్దరు ఆడాళ్ళ మధ్య లిప్ లాక్ సీన్స్.. బాబోయ్.!
కానీ, ఇది కూడా ఇప్పుడు సర్వసాధారణమే. ట్రెండ్ అలా తగలడింది. నయా ట్రెండ్ ఏంటంటే, పెంపుడు జంతువులతో లిప్ లాక్. ఇది మరీ టూ మచ్ కదా.!
పోతారొరేయ్.. అంటూ ఓ పాత సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది కదా.? అయినాగానీ, ఇది న్యూ ట్రెండ్.. ఫాలో అయి తీరాల్సిందే.
ఇదేం పైత్యం, మీ మొహాలు మండ.!
వెర్రి వెయ్యి విధాలని వెనకటికి ఓ పెద్దాయన సెలవిచ్చాడాయె.! వెర్రి వెయ్యి విధాలు కాదు.. వెయ్యి కోట్ల విధాలు.!
ఔను, ఒక్కొక్కడికీ ఒక్కో రకమైన పైత్యం.. వేలం వెర్రి మరి.! కాదు కాదు, ఒక్కొక్కరికీ వేలాది, లక్షలాది వేలం వెర్రులున్నాయ్. అంతలా పైత్యం ప్రకోపించేసింది.

పబ్లిసిటీ పిచ్చిలో భాగంగా పెంపుడు జంతువుల్ని ప్రత్యేక విమానాల్లో తిప్పడం.. వాటితో తమ మూతులు నాకించేసుకోవడం.. వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఇదండీ వరస.!
Pet Dogs Lip Locks ఇంగితం ఎక్కడ.?
రోగాలొస్తాయ్.. అన్న ఇంగితం అస్సలు లేదాయె.! పెంపుడు జంతువులే కదా.. వాటికీ బోల్డన్ని జాగ్రత్తలు.. పరిశుభ్రతకు సంబంధింని చర్యలు తీసుకుంటారు.
అయినాగానీ, అదేం పిచ్చి.? పిచ్చి.. అనేశాం కదా.? అదంతే.! ‘కుక్కలా నాకొద్దు..’ అంటాడో సినిమాలో హీరో. కానీ, ఇప్పుడు అలా అంటే కుక్కలు చిరాకు పడ్తాయ్.! మనుషుల్లా నాకించుకోవద్దనేది వాటి ఆవేదన.
Also Read: పారాసిటమాల్.! వెయ్యి కోట్ల మాఫియా.. అంతేనా.?
జంతువులకీ మనోభావాలుంటాయ్.. వాటినీ అర్థం చేసుకోవాలె.! పబ్లిసిటీ కోసం, పిచ్చి పిచ్చిగా జంతువుల్ని నాకేస్తే ఎలా.?
జంతువుల మీద ప్రేమతోనో, సమాజంలో హోదా కోసమో.. వాటిని పెంచుకుంటుంటారు కొందరు. దురదష్టమేంటంటే వాటి సహజ ఆహార శైలికి భిన్నంగా.. వాటిని ’మేపు‘తుంటారు.
ఈ క్రమంలో ఆ పెంపుడు జంతువులు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి. ఊబకాయం, జీర్ణ సంబంధిత సమస్యలూ ఎక్కువగా చూస్తుంటాం.
అంటే, ఒకరకంగా వాటిని పెంచుకోవడం ద్వారా, వాటిని మనం శిక్షిస్తున్నట్లే లెక్క.