Political Padayatra కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుడండీ.. అని రాజకీయ నాయకుల్ని చూసి జనం నవ్వుకుంటున్నారు.! ఫాఫం రాజకీయ నాయకులకే ఆ విషయం అర్థం కావట్లేదు.
కాకపోతే, రాజకీయ నాయకులు కరెన్సీ నోట్లు విసిరేస్తున్నారు ఎన్నికల సమయంలో.! వాటిని కొందరు ఓటర్లు ఏరుకోక తప్పడంలేదు. ఫలితంగా, అజ్ఞానులు అధికార పీఠమెక్కుతున్నారు.!
సో, ఇక్కడ నవ్వుల పాలవుతున్నదెవరు.? ఇంకెవరు.. జనాలే.! అయినాగానీ, మళ్ళీ మళ్ళీ అదే తప్పు.!
ఆడపిల్లల.. ఆడ.. పిల్ల.!
ఆడ పిల్ల అంటే ఏంటో తెలుసా.? ‘ఆడ’.. అనగా, అక్కడ.. సో, అక్కడి పిల్ల అని అర్థమట.! వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చేప్పేటోళ్ళు రాజకీయ నాయకులనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
పాద యాత్ర.. అంటే, మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్ కాదు.!
లక్షలు, కోట్లు వెచ్చించి జనాన్ని తరలించి.. ‘షో’ చేస్తే దాన్ని పాదయాత్ర అనరు.!
అప్పుడప్పుడూ.. గుర్తొచ్చినప్పుడు చేసేది పాదయాత్ర అసలే కాదు.!
పాదాలతో చేసే ప్రతీదీ పాదయాత్ర అనుకోవడం మూర్ఖత్వం.!
ఆ యాత్ర కోసం బీరూ, బిర్యానీ పంపకాలు.. కూలీ ఇచ్చి మరీ జనాన్ని రప్పించడం.. ఆపై పాదయాత్రల్లో బూతులు.! దేనికోసమిదంతా.?
కేవలం అధికారం కోసం పాదయాత్ర చేస్తే.. అది పాదయాత్ర ఎలా అవుతుంది.? రాజకీయ యాత్ర అవుతుందిగానీ.!
Mudra369
మీ ఆవిడని.. ‘మీ ఆవిడ’ అని ఎందుకు అంటారో తెలుసా.? ‘మీ’ ఆవిడ కాబట్టి.! ఇది కూడా ఓ ఆణిముత్యమే.! ఆగండాగండీ, ఇక్కడితో అయిపోలేదు.. ఇంకా చాలానే వున్నాయ్.!
జనం మరీ అంత వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నారా.? ఔను మరి, అంత వెర్రి వెంగళప్పల్లా జనం కనిపించబట్టే, రాజకీయ నాయకులు ఇలా మాట్లాడగలుగుతున్నారు.
Political Padayatra.. పాదయాత్ర.. దండయాత్ర..
పాదయాత్ర అంటే ఏంటంటే, పాదాల మీద నడిచి చేసే యాత్ర.! పా.. దా…ల… మీద నడిచే యాత్రనే పాదయాత్ర అంటారుట.!
రాజకీయ నాయకులెందుకు కోట్లకు పడగలెత్తుతున్నారు.? ప్రజలెందుకు సంక్షేమ పథకాల కోసం కక్కుర్తిపడే బిచ్చగాళ్ళలా మారిపోతున్నారు.?
Mudra369
ఇంకా నయ్యం.. దండలేసుకుని చేస్తే, దండయాత్ర అనలేదు.! ఓ ప్రజా ప్రతినిథిని విమర్శించే క్రమంలో వందలాది మంది వేలాది మంది జనం మధ్య ‘కొజ్జా’ అనడమే నేటి రాజకీయం.!
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
ఆడ, మగ.. అన్న తేడాల్లేవిక్కడ.! రాజకీయాల్లో అందరూ ఒక్కటే. బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్నది చాలా చాలా చిన్నమాట.
నలుగురూ నవ్విపోదురుగాక.! వాళ్ళకేటి సిగ్గు.? అసలంటూ సిగ్గొదిలేస్తేనే కదా, రాజకీయాల్లో నిలదొక్కుకోకగలిగేది.?