తొలి తెలుగు సినిమా ‘ఒక లైలా కోసం’ నుండి.. సినిమా సినిమాకీ తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళుతోంది పూజా హెగ్దే. ‘మేడమ్ సర్.. మేడమ్ అంతే..’ అని స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అన్నాడంటే.. ఆమెలో అంత ‘విషయం’ వుంది మరి. అందుకే, సక్సెస్.. ఫెయిల్యూర్.. అన్న వ్యవహారాలతో సంబంధం లేకుండా పూజా హెగ్డే (Pooja Hegde About Remuneration and Legs Show) కెరీర్ దూసుకుపోతోంది.
సినిమా సినిమాకీ తన రేంజ్ పెరుగుతోంటే, అందుకు అనుగుణంగానే రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళుతోంది పూజా హెగ్డే. ఈ విషయమై ఎప్పటికప్పుడు విమర్శలొస్తున్నా, వాటిని లైట్ తీసుకుంటోందీ బ్యూటీ.
Also Read: ‘సెంటర్’ పార్ట్: చూడొద్దంటే ఎలా?
‘రెమ్యునరేషన్ నేను కోరుకుంటే వచ్చేది కాదు. నా డిమాండ్‌కి అనుగుణంగా రెమ్యునరేషన్ అనేది నిర్ణయించబడుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు నేను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వరు కదా. అందుకే, డిమాండ్ వున్నప్పుడే నాకు వచ్చే రెమ్యునరేషన్‌ని ఎంజాయ్ చేస్తాను..’ అంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చింది పూజా హెగ్దే.
తెలుగుతోపాటు, హిందీ, తమిళ సినిమాల్నీ పూజా హెగ్డే (Pooja Hegde) బ్యాలెన్స్ చేస్తున్న వైనం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించడంతోనే ఏకకాలంలో వివిధ భాషల్లో సినిమాలు చేయగలుగుతున్నానని చెబుతోన్న పూజా హెగ్దే, కరోనా సమయంలో ఆయా భాషల్ని నేర్చుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది.
ఇంతకీ, ఎక్కువగా కాళ్ళ మీదనే ఫోకస్ పెట్టి.. వాటినే పూజా హెగ్దే ఎందుకు ప్రమోట్ చేస్తుందట.? ఈ ప్రశ్న పూజా హెగ్డేని అడిగితే, ‘అది నా దర్శకుల్ని అడగాల్సిన ప్రశ్న..’ అని తప్పించుకుంది. మరి, ఫొటో సెషన్లలోనూ అదే హాట్ అప్పీల్ ఎందుకలా.? అంటే మాత్రం పూజా హెగ్డే (Pooja Hegde About Remuneration and Legs Show) నుంచి సమాధానమే లేదాయె.