Prabhas Look From ProjectK.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్-కె’ సినిమా నుంచి పోస్టర్ బయటకు వచ్చింది.! అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఈ సినిమా.
వైజయంతీ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పడుకొనే, దిశా పటానీ ఈ సినిమాలో నటిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్.. ఇలా భారీ తారాగణమే వుంది ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో.!
Prabhas Look From ProjectK.. తలకాయని అతికించడం చేతకాలేదా.?
భారీ బడ్జెట్.. భారతీయ సినిమా స్క్రీన్‌పై ఇంతవరకూ ఎవరూ ఏ సినిమాకీ చేనంత ఖర్చు ‘ప్రాజెక్ట్-కె’ సినిమా కోసం చేస్తున్నారట.

ప్రచారం ఇలా వుంటే, వాస్తవాలు ఇంకోలా వున్నాయ్. ‘ప్రాజెక్ట్-కె’ నుంచి వచ్చిన ప్రభాస్ పోస్టర్ చూస్తే, ఎవరైనా సరే ముక్కున వేలేసుకోకుండా వుండలేరు.
Also Read: Taapsee Pannu: గర్భం దాల్చితేనే.. పెళ్ళి చేసుకోవాలె!
ఇదేం డిజైన్.? ఇదేం పోస్టర్.? అని ప్రశ్నిస్తున్నారంతా. తలకాయని కూడా అతికించడం చేతకాలేదా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.
‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ లుక్ విషయమై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. వాటికి కొనసాగింపుగా తయారైంది వ్యవహారం.!