Home » రావణ్, ప్రకాష్ రాజ్‌లని నడిపిస్తున్న హిందూ వ్యతిరేక శక్తులు.!

రావణ్, ప్రకాష్ రాజ్‌లని నడిపిస్తున్న హిందూ వ్యతిరేక శక్తులు.!

by hellomudra
0 comments
Prakash Raj Prashna Ravan

Prakash Raj Prashna Raavan.. హిందూ ధర్మమంటే అస్సలు నచ్చదు.. సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అంటే అస్సలే నచ్చదు.!

ఓ వైపు ‘ప్రశ్న’ అంటూ రావణ్, ఇంకో వైపు ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రకాష్ రాజ్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఇద్దరూ చేస్తున్న ‘నాన్సెన్స్’ అంతా ఇంతా కాదు.!

‘ఒకప్పుడు నేనూ పవన్ కళ్యాణ్ అభిమానినే’ అంటాడు ‘ప్రశ్న’ రావణ్.! సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంగతి సరే సరి.!

కర్నాటక లోక్ సభ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రకాష్ రాజ్, ఓడిపోయాడు.. మళ్ళీ, ప్రత్యక్ష రాజకీయాల వైపు ఆలోచన కూడా చేయలేదు.

కానీ, ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ, సోషల్ మీడియా వేదికగా కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేస్తుంటాడు.. ప్రధాని నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత దూషణలు కూడా చేస్తుంటాడు.

తెలంగాణ రాజకీయాల్లో అప్పటి టీఆర్ఎస్ తరఫున హడావిడి చేశాడు. జాతీయ రాజకీయాల వైపు కేసీయార్ అడుగులేసినప్పుడు, ‘బ్రోకరిజం’ కూడా చేశాడన్న ఆరోపణలున్నాయి ప్రకాష్ రాజ్ మీద.

తెలంగాణ రాజకీయాలు నీకెందుకు.? అంటూ, కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు ప్రకాష్ రాజ్.

మరి, కర్నాటకకి చెందిన ప్రకాష్ రాజ్, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల గురించి ఎందుకు ప్రశ్నించాలి.? తమిళనాడు ఎన్నికల సమయంలో, అక్కడెందుకు ప్రచారం చేయాలి.?

తాజాగా, యూ ట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్‌ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద దూషణలకు దిగినందుకుగాను ఈ అరెస్ట్ జరిగింది.

అంతే కాదు, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా దూషణలకు దిగడం, హిందూ ధర్మ ప్రచారకులపై బెదిరింపులకు దిగడం.. ఇలా ‘ప్రశ్న’ రావణ్ వేసిన వెధవ్వేషాలు అన్నీ ఇన్నీ కావు.

‘ప్రశ్న’ రావణ్ అరెస్టు నేపథ్యంలో, ప్రకాష్ రాజ్ చాలా బాధపడిపోతూ, మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం మొదలు పెట్టాడు.

అసలు ‘ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలకూర వాడిన బూతులేంటి.? అన్న ఇంగితం కూడా లేకుండా, ‘జర్నలిజం’ ముసుగులో తులసి చందు లాంటి యూ ట్యూబర్స్ నిర్లజ్జగా ప్రశ్నలు సంధించేస్తున్నారు.

అసలు వీళ్ళందరి వెనుకా వున్నదెవరు.? వీళ్ళని నడిపిస్తున్నదెవరు.? వీళ్ళందర్నీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నదెవరు.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group