Priyanka Chopra New Business.. బాలీవుడ్ బ్యూటీ… కాదు కాదు, ఇప్పుడామె హాలీవుడ్ సుందరి కూడా.!
ఔను, గ్లోబల్ బ్యూటీగా పిలవబడుతున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra Jonas) గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.!
కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించడమే కాదు, పలు సేవా కార్యక్రమాలతోనూ ఎప్పుడూ బిజీగా వుంటూ వస్తోంది ప్రియాంకా చోప్రా.
కొత్త యాపారం మొదలెట్టేసిందట కదా.!
ప్రియాంకా చోప్రా ఆల్రెడీ పలు వ్యాపారాల్లోనూ చేతులు, కాళ్ళు కూడా పెట్టేసింది.! ఇటు నటన, ఇంకోపక్క సేవా కార్యక్రమాలు, మరో వైపు వ్యాపార కార్యకలాపాలు.!

ఇదంతా ఎలా సాధ్యం.? అంటే, సంకల్పం బలంగా వుంటే, ఏదైనా సాధ్యమని ప్రియాంకా చోప్రా (Priyanka Chopra Jonas) చెబుతుంటుంది.
అసలు విషయంలోకి వస్తే, అమెరికా కేంద్రంగా, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra Jonas) కొత్త యాపారం మొదలు పెట్టిందట. ఆమె భర్త నిక్ జోనాస్ ఈ విషయంలో ఆమెకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాడట.
Priyanka Chopra New Business.. రెస్టారెంట్ వ్యాపారంలోకి..
అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా, ప్రియాంక చోప్రా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ విషయమై ఇంతవరకు ప్రియాంక చోప్రా (Priyanka Chopra Jonas) స్పందించలేదు. వాస్తవానికి అందాల భామలు రెస్టారెంట్ వ్యాపారంలోకి దిగడం ఇదే కొత్త కాదు. చాలామంది ఆ వ్యాపారాల్లో బిజీగా వున్నారు కూడా.

కానీ, ఇంతవరకూ ఎవరూ చేయని విధంగా, సరికొత్త రీతిలో రెస్టారెంట్ బిజినెస్‌ని ప్రియాంక స్టార్ట్ చేసిందన్న ప్రచారమైతే గట్టిగానే జరుగుతోంది.
Also Read: అప్పట్లో నెమలి.! వైజాగ్ సన్నీలియోన్.! మరి.. ఇప్పుడేంటి.?
అన్నట్టు, ప్రియాంక చోప్రా నటించిన గ్లోబల్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఆ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లో సమంత (Samantha Ruth Prabhu) నటించింది. అయితే, ఇండియన్ వెర్షన్ ఇంకా స్ట్రీమింగ్ ప్రారంభం కాలేదు.