శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై బ్యూటీ నివేదా పేతురాజ్ (Racing Queen Nivetha Pethuraj) ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలు చేసినా, ఆమెకి సరైన గుర్తింపు వచ్చింది మాత్రం ’అల వైకుంఠపురమలో’ సినిమాతో మాత్రమే.
ఇంకా సరైన హిట్టు సోలో హీరోయిన్‌గా ఇంతవరకూ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘పాగల్’ సహా పలు సినిమాలతో బిజగా ఉంది ఈ బ్యూటీ. అందం, అభినయం మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ప్రత్యేకత ఈ బ్యూటీలో ఉంది.
ఎప్పుడూ కొత్తదనం కోరుకునే నివేదా పేతురాజ్, కరోనా సమయంలో ఇంకా కొత్తగా ఆలోచించింది. ఫార్ములా 1 రేసింగ్ మీద ఈ బ్యూటీకి మనసు మళ్లిందట. అంతే, ఆలోచన వచ్చిందే తడవు అస్సలు ఆలస్యం చేయకుండా, రేసింగ్‌లో శిక్షణ కోసం బయల్దేరింది. తక్కువ సమయంలోనే లెవల్ 1 ట్రైనింగ్ కూడా పూర్తి చేసేసుకుంది.
లైఫ్ రొటీన్‌గా ఉంటే, బోర్ కొట్టేసిందని అందుకే కొత్తగా ఆలోచించి, సరికొత్త ఛాలెంజెస్ ఎంచుకుంటానని నివేదా పేతురాజ్ పలు సందర్భాల్లో చెప్పింది. రేసింగ్ అంటే, మాటలు కాదు, శిక్షణలో ప్రమాదవశాత్తూ గాయాలు తప్పకపోవచ్చు. అందాల భామలకు చిన్నపాటి ప్రమాదం జరిగినా కెరీర్ అటకెక్కిపోతుంది. ఆ భయంతోనే రిస్కీ అటెంప్ట‌్స్ చేయరు.
కానీ, నివేదా పేతురాజ్ చాలా స్పెషల్ కదా. అందుకే ఎంత రిస్క్ అయినా లెక్క చేయనంటోంది. చాలా మంది హీరోలే ఇలాంటి విషయాల్లో రిస్క్ తీసుకోరు. ఏది ఏమైనా నివేదా పేతురాజ్ (Racing Queen Nivetha Pethuraj) బ్యూటిఫుల్ హీరోయిన్‌గానే కాదు, డైనమిక్ బ్యూటీ అని కూడా అనిపించుకుంటోంది.