Rakul Preet Singh Aarambham.. అందాల భామలంటే, సినిమాల్లో నటిస్తే సరిపోతుందా.? ఏం.? వాళ్ళలోనూ వ్యాపార కార్యకలాపాలపై ఆసక్తి వుంటుంది కదా.?
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో నటిస్తూనే, ఫిట్‌నెస్ స్టూడియోలు నిర్వహించింది.
పక్కా బిజినెస్ మైండెడ్ అనలేంగానీ, వ్యాపార కార్యకలాపాల నిర్వహణ ఆమెకి ఇష్టం.! అందుకే, ఫిట్‌నెస్ స్టూడియోల వ్యాపారాన్ని భలేగా చేసింది.
Rakul Preet Singh Aarambham.. ఇప్పుడేమో సరికొత్తగా ఆరంభిస్తోంది
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మరో వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. ఇది భోజన ప్రియులకు సంబంధించినది. అది కూడా హైద్రాబాద్‌లోనట.!

అసలు విషయమేంటంటే, రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో హైద్రాబాద్‌లో రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. ‘ఆరంభం’ అని పేరు కూడా పెట్టేసిందిట.
పలువురు సినీ ప్రముఖులు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఔను మరి, తెలుగు సినీ పరిశ్రమలో బోల్డంత మంది అత్యంత సన్నిహితులున్నారు రకుల్ ప్రీత్ సింగ్‌కి.!
అందాల భామలకి ఇది కొత్తేమీ కాదు..
నిజానికి, చాలామంది అందాల భామలు రెస్టారెంట్స్ ఛెయిన్స్ నిర్వహించారు. ఇంకా చాలా చాలా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు, నిర్వహిస్తూనే వున్నారు.

ఎవరి అభిరుచి వాళ్ళది.! ఇంతకీ, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) రెస్టారెంట్ ఎలా వుండబోతోంది.? అది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.
బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ కారణంగా, సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. అదేనండీ, తెలుగు సినిమాలకి. హిందీలో మాత్రం, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు ఈ మధ్యన బాగానే చేసింది.
Also Read: పగలు వద్దే వద్దు.!? పడక మీదే ఎందుకు ముద్దు.!?
అయినా, హైద్రాబాద్‌లోనే రెస్టారెంట్‌ని ఎందుకు రకుల్ ప్రీత్ సింగ్ పెడుతున్నట్లు.? ఏమో, హైద్రాబాద్‌లో భోజన ప్రియులు ఎక్కువనేమో.!