Rakul Preet Singh IT Raids.. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ మీద ‘పన్ను ఎగవేత’ ఆరోపణలు వచ్చాయి. మనీ లాండరింగ్ ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
వినిపించడమేంటి.? ఏకంగా ఐటీ శాఖ రంగంలోకి దిగి రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు ఆమె భర్త అలానే ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తుంటేనూ.!
కొన్నాళ్ళ క్రితం రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీని పెళ్ళాడింది. ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ.
‘పనోరమా స్టూడియోస్’ బ్యానరలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా నిర్మాణం ముసుగులో, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు అందినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ‘సోదాల’ నేపథ్యంలో వెల్లడించారు.
సోదాల సందర్భంగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామనీ, అవకతవకలు జరిగాయా.? లేదా.? అన్నదానిపై పూర్తి వివరాలు సోదాలు పూర్తయిన అనంతరం వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

కాగా, సినీ ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొత్తేమీ కాదు. కొత్త సినిమాల రిలీజ్‌ల సమయంలో ఈ తరహా సోదాలు ఆయా నటీనటులు, దర్శక నిర్మాతలపై జరగడం పరిపాటి.
ఇక, ఈ సోదాలపై ఇటు రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ ఇంకా స్పందించాల్సి వుంది.
అయితే, సినిమాల నిర్మాణం పేరుతో పెద్ద మొత్తంలో సొమ్ముల్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారంటూ రకుల్ కుటుంబంపై ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ఈ మధ్య తరచూ రకుల్, విదేశీ టూర్లలో బిజీ బిజీగా గడుపుతోంది.
స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని వెంటేసుకుని రకుల్ విదేశాలకు వెళ్లి వస్తుండడం, దీనికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం తెలిసిన విషయాలే.
సెలబ్రిటీలన్నాక విదేశీ టూర్లు సహజం. స్నేహితులతో విదేశీ టూర్లలో ఎంజాయ్ చేయడం సహజాతి సహజం.. అనుకోండి.. అది వేరే సంగతి.
