Ramcharan JrNTR Global Awards.. ఏడవకండి.! యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి కూడా ఓ అవార్డు బిచ్చమేసేశారు..’ అంటూ సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానుల పేరుతో కొందరు సెటైర్లేస్తున్నారు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి జూనియర్ ఎన్టీయార్ హాజరు కాలేకపోయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, రాజమౌళి తదితరులు హాజరై అవార్డుల్ని స్వీకరించారు.
దాంతో, ఎన్టీయార్ అభిమానులకు కోపమొచ్చింది. ‘హెచ్‌సిఎ’ అవార్డుల జ్యూరీని తిట్టి పోశారు.
అమ్మకానికి అవార్డులా.?
అభిమానమే దురభిమానంగా మారుతుతున్న రోజులివి.!
అమ్మేదెవరు.? అవార్డులు కొనేదెవరు.?
ఇకపై తెలుగు సినిమాకి అవార్డులు ఇవ్వాలంటే ఎవరైనా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే.
Mudra369
దాంతో, ‘ఎన్టీయార్‌ని పిలిచాం.. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన కోసం అవార్డు సిద్దంగా వుంది’ అని వివరణ ఇచ్చింది ఆ సంస్థ.
Ramcharan JrNTR Global Awards.. కొనుక్కుంటే అవార్డులొస్తాయా.?
తాజాగా ఎన్టీయార్‌తోపాటు అలియా భట్‌కి కూడా అవార్డును పంపిస్తున్నట్లు హెచ్‌సిఎ వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన ఫొటోల్లో ‘అవార్డు’ స్వరూపం కాస్త తేడాగా వుంది, రామ్ చరణ్ అందుకున్న అవార్డుతో పోల్చితే.

అంతే, ‘ఎన్టీయార్, ఆ అవార్డుని కొనుక్కున్నాడు’ అన్న చర్చ తెరపైకొచ్చింది. అసలు అలా జరుగుతుందా.? హాలీవుడ్ నటీనటులు పోటీ పడిన ఈ పురస్కారాల వేడుకలో అవార్డుల్ని అమ్ముతారా.?
Also Read: ఎన్టీయార్ Vs రామ్‌చరణ్: అసలైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎవరు?
‘ఇంకెప్పుడూ ఇండియన్ సినిమాలకి.. అందునా, తెలుగు సినిమాలకి అవార్డులు ఇవ్వకూడదు’ అన్న నిర్ణయానికి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వచ్చేసి వుండాలి.
అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రమోట్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ ఎంత కష్టపడుతోంటే, ఈ క్రమంలో రామ్ చరణ్, ఎన్టీయార్ ఎంత మేర ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారో అందరికీ కనిపిస్తూనే వుంది.
కానీ, పైత్యం.. అభిమానమనే ముసుగేసుకుని.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
Mudra369
అంతలా, సోకాల్డ్ హీరోల అభిమానుల పేరుతో కొందరు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌ని సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేశారు.