Ranveer Singh Vs Sherlyn Chopra.. తప్పొప్పుల పంచాయితీకి ఆస్కారం లేని వ్యవహారమిది. అబ్బాయిలు చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తే తప్పు కాదా.? అదే పని అమ్మాయిలు చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారా.?
వామ్మో.! ఇదెక్కడి వింత వాదన అనుకునేరు. నిజానికిది కొత్త వాదన కాదు. చాలాకాలంగా వినిపిస్తున్నదే.
తాప్సీ (Taapsee Pannu), స్వరా భాస్కర్ (Swara Bhaskar).. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వుంటుంది.. పురుషాధిక్య సమాజాన్ని ప్రశ్నించిన అతివల సంఖ్య.
ఆకాశంలో సగం, అన్నింటా సగం.! కాదన్నదెవరు.? అయితే, మహిళల శరీరాకృతి వేరు, పురుషుల శరీర నిర్మాణం వేరు. అదే కదా అసలు సమస్య.!
తప్పు చేసింది ఆ దేవుడే..
ఆ దేవుడే పెద్ద తప్పు చేసేసినట్లున్నాడు. లేకపోతే, మగాళ్ళకీ.. ఆడాళ్ళకీ ఈ వస్త్రధారణ విషయంలో తేడాలొచ్చేవి కాదు.
అమ్మాయిలు ఎందుకు జుట్టుని ముడేసుకోవాలా.? అబ్బాయిలెందుకు షార్ట్ హెయిర్ వుండాలి.?
ఆగండాగండీ, ఈ మధ్యన అబ్బాయిలూ జట్టు పెంచేసుకుని, పిలకలతో కనిపిస్తున్నారు. అదొక స్టైలిష్ వ్యవహారం. అమ్మాయిలూ తక్కువేం తిన్లేదు, షార్ట్ హెయిర్‌తో కనిపిస్తున్నారు.

అమ్మాయిలు, మోకాలికి అర అడుగు పైనే తప్ప, కిందకి నిక్కర్లు, స్కర్టులు దించని వైనాన్ని చూస్తున్నాం. అబ్బాయిల సంగతి సరే సరి.! ఇక్కడ ఎవరూ తక్కువ కాదు.
బాలీవుడ్ నటుడు రణవీర్ కపూర్, ఇటీవల నగ్నంగా ఫొటో సెషన్ చేయించుకోవడంతో, నటి షెర్లీన్ చోప్రా గుస్సా అయ్యింది.
Ranveer Singh Vs Sherlyn Chopra.. తప్పెవరిది.? పబ్లిసిటీ ఎవరిది.?
‘ఆయన మగాడు కాబట్టి, ధైర్యంగా ఆ పని ఇండియాలో చెయ్యగలిగాడు.. నేనైతే విదేశాలకు పోవాల్సి వచ్చింది..’ అంటూ షెర్లీన్ చోప్రా దీర్ఘాలు తీసింది.
Also Read: ‘పుష్ప’రాజ్ మూడో పార్ట్.! అసలేంటి కథ.?
ఇలా తయారయ్యింది పరిస్థితి. ఇంతకీ, ఇక్కడ తప్పెవరిది.? జస్ట్ లైట్ తీస్కోవాల్సిందే. కానీ, అలా లైట్ తీసుకుంటే వివాదాలెందుకు ముదిరి పాకాన పడ్తాయ్.?
మీడియాకి మేత కావాలి. ఆ మేతని సెలబ్రిటీలు ఇస్తున్నారు.. వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్‌ని మరింత పెంచడానికి, పనీ పాటా లేనోళ్ళెప్పుడూ రెడీగా వుంటారు.. ఏదో ఒక వివాదం రాజేయడమే వీళ్ళ పని.