Rashi Singh Three Roses.. ఏమో, లక్కు తోక తొక్కితే రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో.! ఇంతకీ, ఎవరీ అందాల భామ.!
పేరేమో, రాశి సింగ్.! పలు చిన్న సినిమాల్లో ఇంట్రెస్టింగ్ రోల్స్ చేసింది. హీరోయిన్గా చేసింది, నెగెటివ్ షేడ్స్ వున్న రోల్స్ కూడా చేసేసింది.
ఏ ఛాన్స్ వచ్చినా వదులకోలేదు. అదే సమయంలో, హిట్టు ఫ్లాపు అన్న తేడాల్లేకుండా.. రాశి ఖన్నాకి అవకాశాలు వస్తూనే వున్నాయ్.
Rashi Singh Three Roses.. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్గా..
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘పాంచ్ మినార్’ సినిమాలో హీరోయిన్గా నటించింది రాశి సింగ్. ఇంకో రెండు మూడు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగానే వున్నాయి.
రాశి సింగ్ నటించిన కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలవుతున్నాయో.. ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా తెలియని పరిస్థితి వుంది.
‘బ్లైండ్ స్పాట్’ సినిమాలో రాశి సింగ్ నటించింది. మే 9న థియేటర్లలోకి వచ్చింది ఆ సినిమా. కొన్నాళ్ళ క్రితం వచ్చిన ‘ప్రసన్నవదనం’ సినిమాలో రాశి సింగ్ నెగెటివ్ షేడ్స్ వున్న పోలీస్‌గా నటించింది.
సుహాస్ హీరోగా నటించాడు ‘ప్రసన్నవదనం’ సినిమాలో.

ఇంతలోనే, ఈ బ్యూటీకి మరో ఛాన్స్ వచ్చింది. ఓ వెబ్ సిరీస్‌లో నటించే ఛాన్సే అది. గతంలో వచ్చిన ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్‌కి కొనసాగిపుగా రానున్న రెండో పార్ట్ ఇది.
మొదటి సిరీస్‌లో ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ నటించారు. రెండో సిరీస్‌లో ఈషా రెబ్బ మాత్రమే కొనసాగింది. రెండు కొత్త గులాబీల్లో ఓ గులాబీగా ఛాన్స్ దక్కించుకుంది కుషిత.
Also Read: మెగాస్టార్ చిరంజీవితో ‘సిల్వర్ స్క్రీన్ ఎమ్మెల్యే’ ఇంకోస్సారి!
మూడో గులాబీ రోల్, రాశి ఖన్నాకి దక్కింది. దీనికి సంబంధించి ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. చాలా పద్ధతిగా కనిపించిన రాశి సింగ్, అంతలోనే, మోడ్రన్ లుక్‌లోకి మారిపోయింది.
బోల్డ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఈ ‘త్రీ రోజెస్’. ‘అంతకు మించి’ అనేలా బోల్డ్ కంటెంట్, ఈ రెండో సీజన్లో వుంటుందా.? వుండే వుండొచ్చు.