Rashmi Gautam Sanatana Dharma.. తగ్గేదే లే.! అంటోంది బుల్లితెర బ్యూటీ, సినీ నటి రష్మి గౌతమ్.!
సినిమాల్లో అవకాశాలు, బుల్లితెరపై ఛాన్సులు.. వీటి కబుర్లు పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం రష్మి గౌతమ్ పేరు మార్మోగిపోతోంది.!
సనాతన ధర్మానికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరో ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేస్తే, అదే పోస్ట్‌ని రష్మి గౌతమ్ తన టైమ్‌లైన్‌లో షేర్ చేయడంతో మొదలైంది రచ్చ.
చాలామంది రష్మికి సనాతన ధర్మం గురించి ‘క్లాసులు’ పీకేందుకు ప్రయత్నిస్తున్నారు. సనాతన ధర్మాన్ని తప్పు పడుతున్నారు.
అలాంటివారికి రష్మి ఓపిగ్గా బదులు ఇస్తోంది. తాను ఆచరిస్తున్న సనాతన ధర్మం గురించి గొప్పగా చెబుతోంది.
Rashmi Gautam Sanatana Dharma.. ఆనందం.. గౌరవ ప్రదం.!
‘నా ఆనందం నాది.. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, నేను ఆనందంగా, గౌరవ ప్రదంగా వున్నాను..’ అని అంటోంది రష్మి గౌతమ్.
వేరే మతానికి చెందిన ఓ నెటిజన్ సంధించిన ప్రశ్నకు బదులిస్తూ, ‘నీ ప్రపంచంలో నువ్వు వుండు. నా ప్రపంచంలో నేను వుంటాను. ఎవరి ఆనందం వారిది..’ అని పేర్కొంది.
సోషల్ మీడియా అన్నాక, ఈ తరహా ప్రశ్నలు, ట్రోలింగ్, సమాధానాలు.. ఇవన్నీ మామూలే.! వాటికి సమాధానం చెప్పుకుంటూ పోతే, రోజులో 24 గంటలు కాదు, వెయ్యి గంటలు వున్నా సమయం సరిపోదు.!

కొందరేమో, రష్మి గౌతమ్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందంటున్నారు. ఇంకొందరేమో, ఆమె మంచి పనే చేస్తోందని చెబుతున్నారు. ఎవరి వాదన వారిది.!
Also Read: దివ్య భారతి బయోపిక్.! ఆ అందగత్తె ఎవరు.?
సనాతన ధర్మం కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు. ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారివి.! అలాంటి వాటిని తప్పు పట్టడమో, రూపు మాపేస్తామనడమో మూర్ఖత్వం.!
ఒక్కటి మాత్రం నిజం.! సనాతన ధర్మంపై వ్యూహాత్మక రాజకీయ దాడి జరుగుతోంది.! ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా సనాతన ధర్మంపై అవాకులు చెవాకులు మామూలే.
కానీ, సనాతన ధర్మం తన మనుగడని ఎప్పటికీ కోల్పోదు.!