ఎవరూ ఊరికే నేషనల్ క్రష్ అయిపోరు.! ఆమెలో అంతలా ‘క్రష్’ చేసేసే టాలెంట్ వుంది మరి. అందుకే, Rashmika Mandanna కాస్తా ‘క్రష్మిక’ అయ్యింది.!
ఈ కన్నడ కస్తూరి, కన్నడ సినీ పరిశ్రమ నుంచి నటిగా ప్రస్థానం మొదలు పెట్టి, తెలుగు సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకుని, తద్వారా తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ రష్మిక వరుస సినిమాలు చేసేస్తోంది. దటీజ్ రష్మిక.! చాలా తక్కువ కాలంలోనే నటిగా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకుంది.
Rashmika Mandanna.. స్టైలిష్ ఐకాన్ రష్మిక..
స్టైలింగ్ విషయంలో ‘తగ్గేదే లే’ అన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది రష్మిక. కొన్నిసార్లు, ‘ఈ డ్రస్ అస్సలేమాత్రం సూట్ అవలేదు..’ అనే విమర్శలు రష్మిక వినిపిస్తుంటాయ్ కూడా.
అయినాగానీ, రష్మిక స్టైలింగ్ చాలాసార్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది, మెప్పిస్తుంది.. ‘వారెవ్వా..’ అనిపిస్తుంటుంది.

ఏ డ్రస్‌కి అయినాగానీ, పెర్‌ఫెక్ట్‌గా సూట్ అవ్వాలంటే, ఫిట్నెస్ తప్పనిసరి అని చెబుతుంటుంది రష్మిక. అందుకు తగ్గట్టుగానే ఫిట్‌గా వుండేందుకు కష్టపడుతుంటుంది.
ఫిట్‌గా వుంటేనే సరిపోతుందా.? ఏ డ్రస్‌కి తగ్గట్టుగా ఆ డ్రెస్‌కి బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలి. ఈ విషయంలో రష్మిక ‘మాస్టర్ డిగ్రీ’ చేసేసిందనడం సబబేమో.!
ఇంతకీ, ఈ డ్రెస్ స్పెషల్ ఏంటబ్బా.?
తాజాగా రష్మిక సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రత్యేకత ఏంటో తెలుసా.? డెనిమ్ జీన్స్.! జీన్స్ ప్యాంట్ కాస్త కట్ చేసి, ‘ఇన్నర్ వేర్’ తరహాలో డిజైన్ చేశారు.
Also Read: Rhea Chakraborty ఈజ్ బ్యాక్.! గ్లామర్ షో షురూ.!
జాకెట్ అలాగే బాటమ్ కూడా డెనిమ్ జీన్స్‌తో డిజైన్ చేసిందే. ‘బ్రా’బోయ్.. అనిపించేలా, ఆ టాప్ ఇన్నర్‌ని ప్యాంట్ బటన్‌తో సహా డిజైన్ చేయడం ఆసక్తికరమైన విషయం.
రష్మిక అంటే మాటలా.? ఎవరో డిజైన్ చేసింది ఆమె ధరించింది నిజమే.. కానీ, ఆమెకీ ఆ టేస్ట్ వుంటేనే కదా.. ఆ కాస్ట్యూమ్ ఆమె శరీరంపైకి వచ్చేది.?