సౌత్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక మండన్న.. (Rashmika Mandanna Goes Bollywood) అదీ, అతి తక్కువ సమయంలోనే. ఇప్పుడామె చూపు, బాలీవుడ్‌పై పడింది. ‘డియర్ కామ్రేడ్’ సినిమా టైమ్‌లోనే రష్మిక బాలీవుడ్ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరిగింది.
అప్పట్లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రష్మిక మండన్నతో ఏకంగా మూడు సినిమాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా గాసిప్స్ వచ్చాయి. అయితే, అప్పట్లో ఆ గాసిప్స్‌ని లైట్ తీసుకుంది రష్మిక. కానీ, ఇప్పుడు రష్మిక.. బాలీవుడ్ ‘మిషన్’ షురూ చేసింది.
‘మిషన్ మజ్ను’ పేరుతో తెరకెక్కనున్న ఓ థ్రిల్లర్ మూవీలో రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించబోతోంది. బాలీవుడ్ నటుడు సిద్దార్ధ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సౌత్ నుంచి బాలీవుడ్‌కి అందాల భామలు వెళ్ళడం కొత్తేమీ కాదు.
కొందరు సౌత్ బ్యూటీస్, బాలీవుడ్‌కి వెళ్ళి అక్కడే సెటిలైపోయారు. కొందరు అటు బాలీవుడ్‌నీ, ఇటు సౌత్ సినిమానీ బాగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. కొందరైతే, బాలీవుడ్‌కి వెళ్ళి, అక్కడ సక్సెస్‌లు రాక.. బ్యాక్ టు పెవిలియన్.. అంటూ సౌత్‌లోనే సెటిలైపోవాల్సి వచ్చింది.
ఇక, బాలీవుడ్ బ్యూటీస్ కూడా అక్కడ తమకు సెట్ అవదనుకుని, సౌత్‌లో సెటిలైపోయిన సందర్భాలూ చాలానే కనిపిస్తాయి. అయితే, రష్మిక మాత్రం, బాలీవుడ్‌నీ సౌత్‌నీ బ్యాలెన్స్ చేయగలనని అంటోంది. ‘మిషన్ మజ్ను’ సంగతి పక్కన పెడితే, తెలుగులో అల్లు అర్జున్ (Allu Arjun) సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది రష్మిక.
సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో ఈ ‘పుష్ప’ (Pushpa) సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకీ రష్మిక (Rashmika Mandanna) పేరు ప్రముఖంగా విన్పిస్తోన్న విషయం విదితమే.
తెలుగులో పరిస్థితి ఇలా వుంటే, తమిళంలోనూ రష్మిక రెండు మూడు సినిమాలు చేస్తోంది. కన్నడలో ఆమె నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక, బాలీవుడ్‌లో ఎంత బిజీగా వున్నా, సౌత్ సినీ పరిశ్రమ పట్ల తన అభిమానం తగ్గదనీ, మరీ ముఖ్యంగా తనను స్టార్‌ని చేసిన తెలుగు సినీ పరిశ్రమకు ఇచ్చే ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదని అంటోంది రష్మిక (Rashmika Mandanna Goes Bollywood).